Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- బోనకల్
వ్యవసాయ రంగంలో అధునాతన పద్ధతిలో వ్యవసాయ సాగుకు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి చేస్తున్నారని జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు, రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు, రైతు సమన్వయ సమితి జిల్లా కన్వీనర్ నల్లమల వెంకటేశ్వరరావు అన్నారు. మండల పరిధిలోని కలకోట గ్రామంలో రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ చంద్రశేఖర రావు మన్నలను పొందిన ఆదర్శ రైతు పైడిపల్లి దశరథ రావు కు చెందిన పొలంలో వరి నాటు వేసే ప్రక్రియ కు బదులు కరివేద పద్ధతిలో లింగాల కమల్ రాజు, కొండబాల కోటేశ్వరరావు , రైతు నల్లమల వెంకటేశ్వరరావు మంగళవారం వడ్లను చల్లారు. ఈ కార్యక్రమంలో మధిర ఏ డి ఏ కొంగర వెంకటేశ్వర రావు, మధిర వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ జంగా రవికుమార్, మాజీ చైర్మన్ చావా రామకృష్ణ, ఆత్మ కమిటీ చైర్మన్ కోటేశ్వరరావు, డిసిసిబి డైరెక్టర్ ఐలూరు వెంకటేశ్వర రెడ్డి, మధిర సొసైటీ అధ్యక్షుడు బిక్కి ప్రసాదు, టిఆర్ఎఎస్ నాయకులు వేమిరెడ్డి త్రివేణ, బోయపాటి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.