Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తాను టిఆర్ఎస్లోనే కొనసాగుతా
- ప్రజలందరికీ అందుబాటులో ఉంటా...
- అండగా ఉంటా
- మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
నవతెలంగాణ-బోనకల్
జలవివాదంలో రెండు తెలుగు రాష్ట్రాల మధ్య కేంద్ర ప్రభుత్వం చిచ్చు పెట్టడానికి ప్రయత్నాలు చేస్తోందని టిఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు, ఖమ్మం మాజీ పార్లమెంటు సభ్యులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఘాటుగా విమర్శించారు. గోవిందపురం ఎల్, లక్ష్మీపురం,పెద్ద బీరవల్లి, చిన్న బీరవల్లి, నారాయణపురం, రావినూతల, బోనకల్ చిరునోముల, గోవిందాపురం ఏ, ఆళ్లపాడు గ్రామాలలో ఇటీవల మృతిచెందిన పలు కుటుంబాలను ఆయన మంగళవారం పరామర్శించారు. కరోనా వ్యాధితో మృతి చెందిన పలు కుటుంబాలకు ఆర్థిక సహాయం అందజేశారు. అనంతరం గోవిందాపురం ఎల్ గ్రామంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జరిగే ప్రతి ఎన్నికలలో టిఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలో ఘనవిజయం సాధిస్తుందని తెలిపారు. కొంతమంది పగటికలలు కంటున్నారని అవి వారికి కలలుగానే మిగిలిపోతాయని కాంగ్రెస్ నూతన అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని ఉద్దేశించి ఘాటుగా వ్యాఖ్యానించారు. తాను పార్టీ మారుతానంటూ ప్రచారం చేస్తున్నారని తాను పార్టీ మారాల్సిన అవసరం లేదని, టిఆర్ఎస్ పార్టీలో తనకు చాలా స్వేచ్ఛ ఉందన్నారు. కార్యక్రమంలో టిఆర్ఎస్ నాయకులు కోట రాంబాబు, ఉమ్మ నేని కష్ణ ,సాధినేని రాంబాబు, బండి వెంకటేశ్వర్లు, తమ్మారపు బ్రహ్మం, కళ్యాణపు నాగేశ్వరరావు, బోయినపల్లి మురళి, కిన్నెర పాపారావు, భూక్యా సైదా నాయక్, జెర్రిపోతుల రవీంద్ర, భాగం నాగేశ్వరరావు, కొమ్మినేని ఉపేందర్, సండ్ర కిరణ్, పెద్ద బీరవల్లి సర్పంచ్ ఆళ్ల పుల్లమ్మ పాల్గొన్నారు.
ఖమ్మంరూరల్ : ఇటీవల మృతిచెందిన చింతపల్లి గ్రామానికి చెందిన తోట వెంకటేశ్వర్లు కుటుంబాన్ని మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి మంగళవారం పరామర్శించారు. కార్యక్రమంలో నాయకులు తోట రామారావు, వీరభద్రం, శేషయ్య, పెంటయ్య,చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
తిరుమలాపయపాలెం: మీ కష్టసుఖాల్లో కుటుంబ సభ్యుడిగా ఎల్లప్పుడు తోడుగా ఉంటానని టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి బాధిత కుటుంబాలకు భరోసా ఇచ్చారు. మంగళవారం తిరుమలాయపాలెం మండలంలో ఆయన పర్యటించారు. గోపాలపురం గ్రామంలోని వైస్ సర్పంచ్ తల్లి చనిపోయినందున ఆమె చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఇదే గ్రామంలో కోసూరి భారతమ్మ, ఎరగాని వీరయ్య ఇటీవల అనారోగ్యంతో మరణించగా వారి కుటుంబ సభ్యులను ఓదార్చి మనోధైర్యం కల్పించారు. పిండిప్రోలు గ్రామంలో ధనేకుల వేణుగోపాల్, చామకూరి తిరుమలయ్యలు మృతిచెందగా వారి చిత్రపటాలకు పూలమాలవేసి నివాళులు అర్పించారు. తెట్టలపాడు గ్రామంలో దొంతగాని క్రిష్ణయ్య, ఎల్లె నారయ్యలు మరణించగా వారి కుటుంబ కుటుంబ సభ్యులను పరామర్శించారు. తిమ్మక్కపేట గ్రామంలో గారె శ్రీను, చుంచు వెంకమ్మ, పత్తి వీరయ్య, శీరం భద్రయ్య మరణించగా వారి చిత్రపటాల వద్ద నివాళులు అర్పించి కుటుంబ సభ్యులను ఓదార్చారు. పొంగులేటి వెంట మాజీ డీసీసీబీ చైర్మన్ మువ్వా విజరుబాబు, మండల రైతు సమన్వయ సమితి కన్వినర్ చావా శివరామకృష్ణ, సొసైటీ చైర్మన్ రామ సహాయం నరేష్ రెడ్డి, మాజీ ఎంపీపీ అశోక్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ బత్తుల రవికుమార్, తిరుమలాయపాలెం సొసైటీ వైస్ చైర్మన్ చామకూరి రాజు పాల్గొన్నారు.
చర్చి, దేవాలయం నిర్మాణానికి మాజీ ఎంపీ పొంగులేటి ఆర్ధిక సహాయం
ఖమ్మం : కొణిజర్ల మండలం గోపవరం గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న చర్చి కొరకు పోంగులేటి శ్రీనివాసరెడ్డి ఆర్ధిక సహాయంను అందించారు. మంగళవారం తన క్యాంప్ కార్యాలయంలో నిర్మాణ కమిటీ సభ్యులు పొంగులేటిని కలువగా చర్చి నిర్మాణంలో తనవంతు సహాయంగా రూ.25 వేలు అందించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రార్ధనా మందిరాలు నిర్మించటం వలన ఆధ్యాత్మికత నెలకొంటుందని వారు అన్నారు. రఘునాధపాలెం మండలం రాంక్యా తండాలో నిర్మిస్తున్న రామాలయ నిర్మాణానికి రూ.25 వేలు ఆర్ధిక సహాయంను స్థానిక ఎంపీటీసీ వెంకన్న, మూడు చిన్నాలకు అందజేశారు. మధిర మండలం మాటూరు గ్రామంలో దివంగత కృష్ణమాచార్యలు విగ్రహ నిర్మాణ కార్యక్రమానికి రూ.50 వేలు ఆర్ధిక సహాయంను స్థానిక గ్రామస్థులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో కొణిజర్ల ఎంపీపీ గోసు మధు, గోపిశెట్టి వెంకటేశ్వర్లు, గోపవరం సర్పంచ్ అద్దంకి చిరంజీవి, కొత్త కాచారం సర్పంచ్ రంగు సత్యనారాయణ, గోపవరం పీఏసీఎస్ చైర్మన్ చెరుకుమళ్ల రవి, రైతు బంధు మండల కన్వినర్ దొడ్డపనేని రామారావు పాల్గొన్నారు