Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రియుని ఇంటి ఎదుట వదిలిన బంధువులు
నవతెలంగాణ-బోనకల్
ప్రియుడుపెళ్లికి నిరాకరించడంతో తీవ్ర మనస్తాపానికి గురైన ప్రియురాలు శానిటైజర్ తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన మండల పరిధిలోని చిరునోముల గ్రామంలో మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. బంధువులు తెలిపిన వివరాల ప్రకారం చిరునోముల గ్రామానికి చెందిన పారా సింధు రావినూతల గ్రామానికి చెందిన పరసగాని వేణు నాలుగు సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నారు. పెళ్లి చేసుకోవాలని ఇటీవల సింధు పట్టుబడటంతో వేణు పెళ్లికి నిరాకరించాడు. దీంతో అతని ఇంటి ముందు రెండు సార్లు దీక్షకు దిగింది. తనకు న్యాయం చేయాలని స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. అయినా సింధుకి పోలీస్ స్టేషన్ లోనూ న్యాయం జరగలేదు. ఈ క్రమంలో పోలీస్ స్టేషన్లో తాను ఫిర్యాదు చేశాననే కోపంతో వేణు, అతని తల్లిదండ్రులు ''నువ్వు దళితరాలివి... నీతో పెళ్లి మాకు ఇష్టం లేదు'' అని స్పష్టం చేసినట్లు సూసైడ్ లెటర్లో పేర్కొంది. విధిలేని పరిస్థితుల్లో తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లుపేర్కొంది. తనను శారీరకంగా లోబర్చుకొని మోసం చేసినందున ఎవరిని వదలొద్దు అని తల్లిని కోరింది. ప్రయివేటు వాహనం ద్వారా బోనకల్ పీహెచ్సీకి తరలించారు. ఆ సమయంలో పీహెచ్సీలో ఎవరూ లేకపోవడంతో పరిస్థితి విషమంగా ఉండటంతో బంధువులు రావినూతలకు తీసుకొచ్చి ప్రియుని ఇంట్లో వదిలివేసి వచ్చారు.