Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-చర్ల
హామీలతో సమస్యలను పరిష్కారం కావని సీపీఐ(ఎం) మండల కార్యదర్శి కొండా చరణ్ అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలో అంబేద్కర్ సెంటర్లో ప్రభుత్వ ఆసుపత్రి, వైద్య సిబ్బంది నియామకం కోసం కేవీపీఎస్, వ్యాకస, సీపీఐ(ఎం)ల ఆధ్వర్యంలో చేస్తున్న ఆరవ రోజు దీక్ష శిబిరం వద్దకు వైద్య అధికారుల బృందం చర్చలకు వచ్చారు. ఈ సందర్భంగా కొయ్యూరు ప్రాథమిక వైద్యుశాల వైద్యాధికారి డాక్టర్ శ్రీధర్ మాట్లాడుతూ దీక్ష డిమాండ్స్ న్యాయమైనవే అని ఇక్కడ ఆసుపత్రి నిర్వహణ జరగని కారణంగా వైద్యులు లేక ప్రజలకు వైద్యం అందని కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్న మాట వాస్తవమేనన్నారు. ఈ విషయంపై జిల్లా వైద్యాధికారిపై అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నారని, జిల్లా వైద్యాధికారి డీఎంఅండ్‌హెచ్‌ఓ దీక్షా శిబిరం నిర్వాహకులతో చర్చలు జరుపమన్నారన్నారు. దీక్షలను విరమింప చేయాలని మీరు డిమాండ్ చేస్తున్న ఈ సమస్యలని త్వరగా పరిష్కారం చేస్తామని డీఅండ్‌హెచ్‌వో అధికారి హామీ ఇచ్చారని అట్టి విషయం శిబిరాల నిర్వాహకులకు తెలియజేయమని అన్నారని చర్ల వైద్య అధికారులు అన్నారు.
ఈ సందర్భంగా పార్టీ మండల కార్యదర్శి కొండా చరణ్ మాట్లాడుతూ మా దీక్షలకు స్పందించి సమస్య పరిష్కారానికి హామీ ఇస్తూ చర్ల వైద్యాధికారులను దీక్షాశిబిరానికి చర్చలకు పంపించిన డీఅండ్‌హెచ్‌వో అధికారికి, చర్చలకు వచ్చిన చర్ల వైద్య అధికారులకు ధన్యవాదము తెలిపారు.
అనంతరం హామీలు సమస్యలకు పరిష్కారం కాదని గత సంవత్సర కాలంగా హామీలతో కాలం వెళ్లదీస్తున్నారని మేము చేస్తున్న పోరాటం హామీల కోసం కాదని 13 పంచాయతీల ప్రజలకు వైద్యం, వైద్యం చేయడానికి సిబ్బంది కావాలని జరుగుతుందని అన్నారు. పరిష్కారం చూపని చర్చలతో ఎటువంటి ఉపయోగం లేదన్నారు. మండల కేంద్రంలో నలుగురు డాక్టర్లని, పదిమంది అనుభవం కలిగిన స్టాఫ్ నర్సులు నియమించి ప్రజలకు 24 గంటలు వైద్యం అందించాలన్నారు. దానితోపాటు మిగిలిన డిమాండ్స్‌పై నిర్దిష్టమైన ఖచ్చితమైన లేక పూర్వకంగా హామీ స్వయంగా డీఎంఅండ్హెచ్లో ఇవ్వాలని అన్నారు. అప్పుడే జరిగిన చర్చలకు ఉపయోగం న్యాయం జరుగుతుందన్నారు. అంతటి తో వైద్య బృందం చర్చల ప్రయత్నాన్ని విరమించి వెనుకకు తిరిగారు.
ఈ కార్యక్రమంలో కేవీపీఎస్ మండల కార్యదర్శి మచ్చా రామారావు, వ్యాకస మండల అధ్యక్షుడు శ్యామల వెంకట్, సీపీఐ(ఎం) నాయకులు ఊడుగుల షారోని, వరలక్ష్మి, పాముల సాంబశివరావు, పార్టీ సభ్యులు ముసలి సతీష్, జగ్గం. రాజు తదితరులు పాల్గొన్నారు.