Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వంట గదిని మధ్య నుంచి మిషన్ భగీరథ పైపులైన్
- కాకర్లపల్లి ప్రాథమిక పాఠశాల పరిస్థితి
నవతెలంగాణ-సత్తుపల్లి రూరల్
ముఖ్యమంత్రి కేసీఆర్ సారూ రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధిలో భాగంగా అవసరమైతే అదనపు తరగతి గదులు కూడా ఏర్పాట్లు చేసుకోండని అంటున్నారు. అదనపు తరగతి గదులు జరపక్కన పెట్టి ఉన్న భవనాల బాగోగులు కాస్త పట్టించు కోండి సారూ.. అంటూ.. ఒక ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల మొరపెట్టుకొంటుంది.
మండల కేంద్రానికి కూతవేటు దూరంలోనే వున్న కాకర్లపల్లి గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల అది. ఈ ప్రాథమిక పాఠశాల గ్రామంలోని మెయిన్ రోడ్డు నందు గ్రామ పంచాయతీ కార్యాలయానికి ఎదురుగా నే వుంది. ఆ కార్యాలయానికి వచ్చే అధికారులు, ప్రజాప్రతినిధులు ఎవరైనా వచ్చి పాఠశాల దుస్థితి చూసి ముఖ్యమంత్రి కేసీఆర్ సారు దృష్టికి తీసుకు పోయి తమ సమస్యలు పరిష్కరిస్తారేమోనని కొన్ని ఏండ్లుగా అందరి వంక ఎంతో ధీనంగా చూసి చూసి ఫలితం లేక పోవడంతో.. ఇప్పుడు ఆ పాఠశాలే కేసీఆర్ దృష్టికి తీసుకు పోయే ప్రయత్నం చేస్తుంది. ఈ పాఠశాల గత కొన్ని సంవత్సరాలుగా కొన్ని వందలమందికి విద్యాబుద్ధులు నేర్పించి, ఎంతో ఉన్నతమైన స్థానాల్లో కుర్చోపెట్టింది. ఇప్పుడు సరైన రక్షణ గోడ లేదు, తరగతి గదులకు సరైన దర్వాజాలు, తలుపులు, కిటికీలు, డోర్లు లేవు. దీనితో గ్రామంలో బెల్టు షాపులు ఎక్కడబడితే అక్కడే ఉండడంతో.. ఈ పాఠశాల తరగతి గది మందుబాబులకు నిలయంగాను, మలమూత్రశాలకు అనువుగాను మారిపోయింది. ఇదే పాఠశాల వంటగది మధ్యలో నుంచి మిషన్ భగీరథ పైపు లైన్ వేసి తిరిగి మరమత్తులు చేయించడంలో అధికారులు నిర్లక్ష్యంతో వంట గది ఉపయోగం లేకుండా పడి వుంది. గతంలో ఎన్నోమార్లు, ప్రజలు, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు, అధికారులు దృష్టికి, తీసుకెళ్లడం జరిగింది. పత్రికలలో రాయడం జరిగింది. అయినా ఫలితం లేకుండాపోయింది. ఇప్పటికైనా ప్రభుత్వం ఈ ప్రాథమిక పాఠశాల సమస్యలను పరిష్కరించి, మరెందరో పేదవిద్యార్థులకు మంచి విద్యాబుద్ధులు నేర్చుకొనే అవకాశం కల్పించాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు.