Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఖమ్మం లీగల్
జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ద్వారా వయోవృద్ధులకు న్యాయ సహాయం అందుతుందని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి మహ్మద్ అబ్దుల్ జావీద్ పాషా అన్నారు. శుక్రవారం సీనియర్ సిటిజన్ సంఘ సభ్యులు న్యాయమూర్తిని కలుసుకొని తమ సంఘ కార్యకలాపాలు, సమస్యలను విన్నవించారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి మాట్లాడుతూ జాతీయ న్యాయసేవాధికార సంస్థ రూపొందించిన పథకాలలో సీనియర్ సిటిజన్స్‌కి సంబంధించిన పథకం అతి ముఖ్యమైనదని అన్నారు. ఈ పథకం ద్వారా వయోవృద్ధ్దులకు వారి సమస్యలను పరిష్కరించడానికి న్యాయసేవా అధికార సంస్థ ప్రీ లిటిగేషన్ విధానంలో కేసులను నమోదు చేసి పరిష్కరిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో న్యాయసేవాసంస్థ సభ్యుడు డాక్టర్ కడివెండి వేణుగోపాల్, పారా లీగల్ వాలంటీర్ అన్నం శ్రీనివాసరావు, వయోవృద్ధుల సంక్షేమ సంఘ సభ్యులు పాల్గొన్నారు.