Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తలు
నవతెలంగాణ- ఖమ్మం
రాష్ట్రంలో నిరుద్యోగుల ఆత్మహత్యలకు బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదే డివైఎఫ్ఐ, ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటిల ఆధ్వర్యంలో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తలు అభిప్రాయం వ్యక్తం చేశారు. శుక్రవారం స్థానిక సుందరయ్య భవనంలో ''నిరుద్యోగ సమస్య-పరిష్కారం'' అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో డివైఎఫ్ఐ, ఎస్ఎఫ్ఐ, పివైఎల్ ,పిడిఎస్యూ ,ఎన్ఎస్ యుఐ జిల్లా కార్యదర్శులు షేక్ బషీరుద్దీన్, శ్రీను, జమ్మి అశోక్, ఆజాద్, ఉదరు మాట్లాడుతూ రాష్ట్రం నీళ్ళు, నిధులు, నియామకాలు కోసం పోరాటం చేసి తెచ్చుకున్నదని, అట్లాంటి తెలంగాణలో ఉద్యోగ, ఉపాది అవకాశాలు లేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, దీనికి ఎవరు బాధ్యులని వారు ప్రశ్నించారు. ఇటీవల ఆత్మహత్య చేసుకున్న నాగేశ్వరరావు కుటుంబానికి రూ.15 లక్షల ఎక్స్‌గ్రేషియో ఇవ్వాలని, కుటుంబంలో ఒక ప్రభుత్వ ఉద్యోగం, ఇల్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగ భృతి విధి విధానాలు వెంటనే ప్రకటించాలని, 2.5లక్షల ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేయాలని, నిరుద్యోగందరికీ షరతులు లేని లోన్స్ ఇవ్వాలని తీర్మానం చేశారు. రౌండ్ టేబుల్ సమావేశంలో డివైఎఫ్ఐ, ఎస్ఎఫ్ఐ, పివైఎల్,పిడిఎస్యూ, ఎన్ఎస్ యుఐ, ఇతర సంఘాల నాయకులు ప్రముఖ అధ్యాపకులు బండారు రమేష్, శీలం వీరబాబు, కూరపాటి శ్రీను, పునుకుల సుధాకర్, జి.మస్తాన్, పవన్, చందు, తుడుం ప్రవీణ్, రెడ్డి, నరేష్, మురళి, తదితరులు పాల్గొన్నారు.