Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- లక్షలాది రూపాయలు కటింగ్
- లబోదిబోమంటున్న రైతులు
- న్యాయం చేయాలంటూ కలెక్టర్‌కు వేడుకోలు
నవతెలంగాణ- కల్లూరు
రబీలో పండించిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో అమ్ముకున్న రైతులకు మిల్లర్లు తరుగు పేరుతో లక్షలాది రూపాయలు కటింగ్ పెట్టి మిగిలిన డబ్బులు బ్యాంకులో జమ చేయడంతో తాము తీవ్రంగా నష్టపోయామని రైతులు కలెక్టర్‌ను ఆశ్రయించి న్యాయం చేయాలని వేడుకున్నారు. శుక్రవారం కల్లూరులో విలేకరులతో రైతులు మాట్లాడుతూ తమకు జరిగిన నష్టం గురించి వివరించారు. మండల పరిధిలోని వెన్నవల్లి గ్రామనికి చెందిన రైతులు రబీ సీజన్ పండించిన ధాన్యం ప్రభుత్వ నిబంధనల ప్రకారం ధాన్యంను ఆరబెట్టి ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యంకొనుగోలు కేంద్రంలో అమ్ముకున్నారు. ధాన్యం కొనుగోలు చేసిన మిల్లర్లు తరుగు పేరుతో 40 కేజిల టక్కిలో సుమారు 10 నుండి 13 కేజిల ధాన్యం తగ్గించటంతో ఒక్కొక్క రైతుకు 40 నుండి 50 వేలు వరకు నష్టపోయామని రైతులు పాముల పుల్లయ్య, మార్త వీరవెంకటేశ్వర్లు,ఉప్పు కృష్ణయ్య, బి.సుబ్బారావు, పుల్లయ్య, పి. రామకృష్ణ తదితరులు తెలిపారు. ఈ విధంగా వెన్నవల్లి గ్రామంలో సుమారు 70 మంది రైతులు వందల బస్తాల సంఖ్యలో ధాన్యం అమ్ముకున్నారు. మర్త వీరవెంకటేశ్వర్లుకు సంబంధించి 40 కేజీల బస్తాలు 396 కాటా వేశారు. క్వింటాకు 1888 రూపాయలు చొప్పున 2.99 లక్షలు రావలసి ఉండగా బ్యాంకులో 2.59 లక్షలు మత్రమే వేశారు. ఈ విదంగా రూ.40 వేలు నష్టపోయినట్లు తెలిపారు. పాముల పుల్లయ్య రైతు 756 టిక్కులు కాటా వెయ్యిగా తరుగు పెరుతో 53 టిక్కులు తగ్గించారు దీంతో రూ.44 వేలు తగ్గించి బ్యాంకులో వేశారు. ఉప్పు కృష్ణయ్య 296 టిక్కులు ధాన్యం అమ్మగా 36 టిక్కులు తగ్గించారు. దీంతో ఆ రైతుకు రూ.2.27 లక్షలు రావాల్సి ఉండగా రూ.1.96 లక్షలు బ్యాంకులో వేశారు. రూ.31 వేలు నష్టపోయినట్లు తెలిపారు. ఈ విధంగా 70 మంది రైతులు ఎన్నో లక్షల రూపాయలు నష్టపోయారు. ఈవిషయంపై జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం అందజేసినట్లు తెలిపారు.కలెక్టర్ స్పందించి మిల్లర్లపై చర్య తీసుకొని తమకు న్యాయం చేయాలని వేడుకుంటున్నారు.