Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విలేకరుల సమావేశంలో నగర అధ్యక్షుడు జావేద్
నవతెలంగాణ- ఖమ్మం
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలని రూ40కి దొరికే ఇంధనంపై రూ.65 పన్నులు వేయడం దారుణం మహమ్మద్ జావేద్ అన్నారు. శుక్రవారం ఖమ్మంలో సంజీవరెడ్డి భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన ఛలో రాజ్ భవన్ కార్యక్రమం విజయవంతం అయిందన్నారు. ముందస్తు అరెస్టుల పేరుతో పోలీసులు కాంగ్రెస్ నాయకులను నిర్భంధించారని, అయినా కాంగ్రెస్ నాయకులు అనుకున్నట్లుగా కార్యక్రమాన్ని విజయవంతం చేశారన్నారు. కాంగ్రెస్ పార్టీ హయాంలో క్రూడాయిల్ ధరలకు అనుగుణంగాపెట్రోల్, డీజిల్ ధరలు పెంచితే బీజేపీ గగ్గోలు పెట్టిందని, ఇప్పుడు క్రూడాయిల్ ధర తక్కువగా ఉన్నా మోడీ ప్రభుత్వం మాత్రం అధిక ధరలు వసూలు చేస్తూ సామాన్యుడి నడ్డి విరగ్గొడుతోందని విమర్శించారు. విలేకరుల సమావేశంలో కార్పొరేటర్లు మలీదు వెంకటేశ్వర్లు, సైదులు నాయక్, బి.నిరంజన్, పల్లెబోయిన చంద్రం, మిక్కిలినేని మంజుల నరేంద్ర, డి.వెంకటేశ్వర్లు, ఎన్.వెంకటేశ్వరరావు, ఎల్లూరి రవి, బి.రమేష్ తదితరులు పాల్గొన్నారు.