Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రారంభించిన చైర్మెన్ కంచర్ల రామక్రిష్ణారెడ్డి
- రైతులకు సులభతరం కానున్న సంస్థ సేవలు
నవతెలంగాణ-అశ్వారావుపేట
టీఎస్ ఆయిల్‌ఫెడ్‌కు వెబ్/యాప్‌లను ఆ సంస్థ రూపొందించడంతో దాని సేవలు రైతులకు సులభతరం కావడంతో పాటు చేరువకాను న్నాయి. ఈ మేరకు శుక్రవారం హైద్రాబాద్‌లోని పరిశ్రమల భవన్లో గల ఆ సంస్థ కేంద్ర కార్యాలయంలో రాష్ట్ర ఆయిల్ ఫెడ్ వెబ్/యాప్‌లను ఆ సంస్థ చైర్మన్ కంచర్ల రామకృష్ణారెడ్డి, మేనేజింగ్ డైరెక్టర్ ఎం.సురేందర్ లు లాంఛనంగా ప్రారంభించారు.
ఆయిల్ పామ్ సాగు విస్తరణలో భాగంగా క్షేత్రస్థాయిలో ప్రతి రైతు సోదరునికి అందుబాటులో ఉండే విధంగా అలాగే క్షేత్ర సిబ్బంది సైతం ఆయిల్ పామ్ సాగు విస్తరణను వేగవంతం చేసేందుకు తెలంగాణ సంస్థ సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ వారి సహకారంతో వెబ్, మొబైల్ ఆధారిత యాప్‌ను రూపొందించడం జరిగిందని వారు తెలిపారు.
ఈ యాప్ ఉపయోగాలు
ఈ యాప్ ద్వారా ఆయిల్ ఫామ్ రైతులు వారి ఆధార్, భూమి వివరాలతో సులువైన పద్ధతిలో ఫోన్లోనే మొక్కలకు దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే సంబంధిత ఫీల్డ్ అధికారులు కూడా ఈ అప్ ద్వారా సంబంధిత రైతు వివరాలు నమోదు చేసి రైతులకు కావాల్సిన మొక్కలకై దరఖాస్తు చేయవచ్చు. సంబంధిత ఉన్నతాధికారులు కూడా క్షేత్రస్థాయిలో ఆయిల్ పామ్ సాగు విస్తరణలో జరుగుతున్న పురోగతి వివరాలను ఈ మొబైల్ యాప్ ద్వారా ఎప్పటికప్పుడు పర్యవేక్షించవచ్చు. ఈ యాప్ నేరుగా జీపీఎస్ వ్యవస్థతో అనుసంధానమై ఉండటం వలన రైతుల వ్యవసాయ క్షేత్రంలో నాటిన మొక్కల, ఫీల్డ్‌కు సంబంధించిన ఫోటోలు అప్లోడ్ చేయవచ్చు. అలాగే ఖచ్చితమైన క్షేత్రస్థాయి ఆయిల్ పామ్ సాగు విస్తీర్ణం వివరాలు తెలుసుకునే అవకాశం ఉంది. ఈ యాప్‌ను రైతులు, ఫీల్డ్ ఆఫీసర్లు, ఆయిల్ ఫెడ్ జిల్లా కోఆర్డినేటర్లు, నర్సరీ అధికారులు, చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్లు ఉపయోగించే సదుపాయం ఉంది.
సంబంధిత జిల్లా కలెక్టర్లు, ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా ఆయా జిల్లాల్లో ఆయిల్ పామ్ సాగు వివరాలు తెలుసుకునే విధంగా టీఎస్ ఆయిల్ ఫెడ్ ఈ యాప్‌ను రూపకల్పన చేసింది. ఈ కార్యక్రమంలో... జనరల్ మేనేజర్ సుధాకర్ రెడ్డి, పలు విభాగాల మేనేజర్లు తిరుమలేష్ రెడ్డి, జెన్ను సత్యనారాయణ, ప్రవీణ్ రెడ్డి, రాజశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.