Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జిల్లా ఉద్యాన అధికారి గుడిమళ్ళ సందీప్ కుమార్
నవతెలంగాణ-రఘునాధపాలెం
మండలంలో ఉన్న రైతులు పంటల బీమాను అందరూ సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఉద్యాన అధికారి, గుడిమళ్ళ సందీప్ కుమార్ శుక్రవారం తెలిపారు. ఈ సందర్భంగా రైతులకు పలు సూచనలు జారీ చేశారు. ఈ వానాకాలం పంటలలో వర్ష భీమా, ఖరీఫ్ 2021 కి ప్రణాళిక పథకాన్ని ప్రకటించిన అగ్రికల్చర్ ఇన్సూరెన్స్ కంపెనీ ఆఫ్ ఇండియా లిమిటెడ్, జిల్లాలో మిరప, ఆయిల్ ఫామ్ కు ఈ పథకం వర్తిస్తుందన్నారు. జిల్లాలో మిరప రైతులకు ఎక్కువగా ప్రయోజనం కలిగే అవకాశం ఉందన్నారు. అల్ప వర్షపాతం పరిమాణం 16 ఆగస్టు, నుండి 15 అక్టోబర్ వరకు, అల్ప వర్షపాతం విస్తీర్ణం 1 సెప్టెంబర్, నుండి 28 ఫిబ్రవరి వరకు ఉన్న వాటిని ఆధారంగా చేసుకొని బీమా క్లయిమ్ ఇవ్వబడుతుందన్నారు.గత సంవత్సరం 2 నెలల పాటు అధిక, అత్యధిక వర్షపాతం నమోదు అయిందని వరదల వలన నాటిన మిరప మొక్కలు కూడా కొట్టుకొని పోయాయని ,కానీ రైతులు ఎవరు మిరప పంటలకు బీమా చేయలేదని తద్వారా రైతులు తీవ్రంగా నష్టపోయారని వాపోయారు. రెండు మూడు దఫాలు మొక్కలు నాటడానికి చాలా ఖర్చు పెట్టారని అటువంటి సందర్భాలలో పంటల బీమా రైతులకు కొంత ఊరటనిచ్చే అవకాశం ఉందన్నారు. అనంతరం రైతులు ఈ క్రింది అర్హతలను కలిగిన వారై ఉండాలన్నారు. బ్యాంకులో రుణం తీసుకున్న రైతులు, కౌలు రైతులు, పట్టా భూమి కలిగిన రైతులు అందరూ అర్హులే అని వారు తెలిపారు. రైతులు, దరఖాస్తు ఫారం, భూమి పట్టా పుస్తకం, ఆధార్ కార్డు, బ్యాంకు ఎకౌంటు జిరాక్స్లను ఒక హెక్టారుకు 5900 రూపాయలు చెల్లించి, ఒక లక్ష రూపాయల వరకు పంట బీమా పొందవచ్చని ఆయన తెలిపారు. ప్రీమియం వివరాలు, ఒక ఎకరానికి ప్రీమియం 2000, జిఎస్టి 10 శాతం, మొత్తం 2360 రూపాయలు చెల్లించి బీమా మొత్తం 40 వేల రూపాయలు పొందవచ్చన్నారు. ఒక హెక్టారుకు ప్రీమియం 5000 జిఎస్టి 18 శాతం కలిపి మొత్తం 5900 రూపాయలు చెల్లించి లక్ష రూపాయల వరకు బీమా పొందవచ్చని ఆయన తెలిపారు. మిరప పంటకు బీమా చెల్లించడానికి వచ్చేనెల 15 ఆగస్టు 2021 వరకు రైతులు చెల్లించుకోవాలని వారు సూచించారు. ఆయిల్ పామ్, ఈ నెల 31 జులై 2021 వరకు ఆయిల్ఫామ్ వేసుకున్న రైతులు భీమ చెల్లించు కోవాలని వారు తెలిపారు. ప్రీమియం రైతులు వారి అకౌంట్ ద్వారా చెల్లించవచ్చని ఎలాంటి మధ్యవర్తులు మాటలు నమ్మవద్దని సూచించారు.