Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హాజరుకానున్న సీపీఐ(ఎం) రాష్ట్ర, జిల్లా నేతలు
నవతెలంగాణ-ముదిగొండ
మండలపరిధిలో బాణాపురంం గ్రామానికి చెందిన కమ్యూనిస్ట్ పార్టీ సీనియర్ నాయకులు వీర తెలంగాణ సాయుధ పోరాట యోధుడు, మార్కిస్టు పార్టీ ముద్దుబిడ్డ పోతుల పుల్లయ్య స్తూపవిష్కరణ సోమవారం జరగనున్నది. కామ్రేడ్ పోతుల పుల్లయ్య అనారోగ్యానికి గురై ఈనెల ఏడో తేదీన మృతి చెందిన విషయం విధితమే. పుల్లయ్య స్తూపవిష్కరణకు సీపీఐ(ఎం) రాష్ట్ర నాయకులు పొన్నం వెంకటేశ్వరరావు, పోతినేని సుదర్శన్, జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు, జిల్లా నాయకులు బండి రమేష్, బండి పద్మ, పార్టీ మండల కార్యదర్శి వాసిరెడ్డి వరప్రసాద్ ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు. పుల్లయ్య పార్టీ ఎర్రజెండా నీడలోనే బడుగు బలహీన వర్గాల ప్రయోజనాల కోసం కృషిచేసి మృతి చెందిన పోరాటయోధుడు. 1953లో పార్టీలో సభ్యత్వం తీసుకొని సాధారణ కార్యకర్తగా మొదలైన పుల్లయ్య తన ప్రయాణం నమ్మిన సిద్ధాంతంకై ప్రజాసమస్యలపై పరుగులు పెట్టి పార్టీ అభివృద్ధికి బాటలు వేశారు. బాణాపురం ప్రాంతంలో జరిగిన ప్రజా ఉద్యమాలలో భూస్వామ్య వ్యతిరేక పోరాటాల్లో పుల్లయ్య తనదైన పాత్ర పోషించారు. కామ్రేడ్ రావెళ్ల సత్యం, బాజీ హనుమంతు, గండ్లూరి కిషన్ రావు స్ఫూర్తితో కమ్యూనిస్టు పార్టీలో పనిచేసి నైజాంరజాకర్ల సైన్యాలను కాంగ్రెస్ ప్రభుత్వ భూస్వామ్య విధానాలపై ప్రజలను చైతన్యవంతుల్ని చేస్తూ భూమికోసం, భుక్తి కోసంం జరిగిన పోరాటాల్లో పుల్లయ్య కీలకపాత్ర పోషించి పోలీస్ లాఠీ దెబ్బలు నిర్బంధాలను సైతంం లెక్క చేయకుండా భూస్వాములను పోలీసులను గడగడలాడించిన కమ్యూనిస్ట్ పార్టీ ప్రజానాయకుడు పుల్లయ్యకు నలుగురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. పుల్లయ్య పెద్ద కుమారుడైన పోతుల రాయప్ప పార్టీలో 35 సంవత్సరాలు పూర్తి కాలపు కార్యకర్తగా పనిచేసి నాయకుడిగా గుర్తింపు పొందారు. రాయప్ప ప్రస్తుతం తెలంగాణ జనసమితిలో రాష్ట్ర కార్యదర్శిగా హైదరాబాదులో పనిచేస్తున్నారు.