Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఖమ్మం త్రీటౌన్ శాఖ మహాసభల ప్రారంభ సభలలో నున్నా
- జెండా ఆవిష్కరించిన యర్రా శ్రీకాంత్
నవతెలంగాణ-గాంధీచౌక్
ఈ భూ ప్రపంచంలో మానవుల మధ్య అగాథం పెంచుతూ ఏర్పడుతున్న అసమానతలు రూపు మాపే ఏకైక శాస్త్రీయ మార్గం మార్క్సిజం మాత్రమేనని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వర రావు అన్నారు. స్థానిక ఖమ్మం త్రీటౌన్‌లో మిర్చి కోల్డ్, మిర్చి ఎగుమతి, శ్రామిక మహిళా శాఖా మహాసభలు జరిగాయి. మహాసభల ప్రారంభ సూచికగా సాయికోల్డ్ వద్ద పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు యర్రా శ్రీకాంత్ జెండాను ఎగురవేశారు. అనంతరం పత్తి మార్కెట్ నుండి త్రీటౌన్ పార్టీ కార్యాలయం వరకు భారీ ప్రదర్శన నిర్వహించారు. మహాసభలో నున్నా మాట్లాడుతూ పెట్టుబడి దారి సమాజంలో లాభాపేక్ష తప్ప సమాజ శ్రేయస్సు గురించి పట్టించుకోదని ఫలితమే ఈ అసమానతలు పెరుగుదలకు కారణమని తెలిపారు. ఫలితంగానే నేటి పనిలేనితనం, తీవ్ర సంక్షోభాలు, పర్యావరణ అసమతుల్యతలు, అంటువ్యాధులు తదితర సమస్యలకు మూలం అని పేర్కొన్నారు. ఈ సమస్త సమస్యలకు మార్క్స్ కనుగొన్న శాస్త్రీయ పరిష్కారమే మార్క్సిజం అని, ఈ పరిష్కారం నమ్మి చిత్తశుద్ధితో చివరికంటా పనిచేసే వారే మార్క్సిస్ట్ అని ఈ మహాసభలు మహత్తరమైన ప్రజా కర్తవ్యాన్ని ముందుకు తీసుకు వెళ్ళేందుకు దిశానిర్దేశం చేయనున్నట్లు తెలిపారు.
పార్టీ రాష్ట్ర కమిటి సభ్యులు యర్రా శ్రీకాంత్ మాట్లాడుతూ ఈ ప్రభుత్వాలు కేంద్రంలో, రాష్ట్రంలో పెట్టుబడి దారుల ప్రయోజనాల కోసం పని చేసేవి తప్ప ప్రజా ప్రయోజనాల దృష్ట్యా పని చేయవన్నారు. ఓట్ల, సీట్ల చుట్టూ తప్ప ప్రజా ప్రయోజనాల చుట్టూ రాజకీయాలు చేయవని విమర్శించారు.
ఈ మహసభలలో పార్టీ జిల్లా కమిటి సభ్యులు యర్రా శ్రీ నివాసరావు, త్రీటౌన్ కార్యదర్శి తుశాకుల లింగయ్య, సీనియర్ నాయకులు బండారు యాకయ్య, భూక్య శ్రీ నివాసరావు, పాశం సత్యనారాయణ, మీనాల మల్లికార్జున్, హెచ్. బుజ్జి, పాశం సైదమ్మ, హెచ్. పీరయ్య, పి.వాసవి, రామనర్సమ్మ, జయమ్మ, ఉపేందర్, వెంకమ్మ, జ్యోతి, పూలమ్మ, మాధవి తదితరులు పాల్గొన్నారు.