Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సాగుభూములను ప్లాట్స్గా మారుస్తున్న వైనం
- లక్షలు పలుకుతున్న కుంటభూమి
- సామాన్యుడి దరిచేరని భూముల ధరలు
- చోద్యం చూస్తున్న సంబంధిత శాఖల అధికారులు
నవతెలంగాణ-అశ్వాపురం
ఏజెన్సీలో రియల్ ఎస్టేట్స్ వ్యాపారుల దందా కొనసాగుతోంది. సాగుభూములను లేఅవుట్లుగా చేసి కోట్లరూపాయలు గడిచేందుకు కొందరు పూనుకుంటున్నారు. రోజురోజుకు భూమికి విలువ పెరగడంతో ప్లాట్ల బిజినేస్ ఊపందుకోంటోంది. ఏజెన్సిలోనే ఎకరం భూమిని కోట్లాకు అమ్మేందుకు భూములున్నవారు కార్యచరణను సిద్ధంచేసుకుని మద్యవర్తుల ద్వారా రియల్ వ్యాపారంను కొనసాగిస్తున్నారు. మండల కేంద్రంలోని పరిసర ప్రాంతాలలో ఉన్న భూముల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. సామాన్యుడు సెంటు భూమినికూడా కొనలేని స్థితిలోకి భూముల ధరలు పెరిగిపోయాయి. ఏజెన్సిలో ప్రభుత్వ నిబందనల ప్రకారం ఎకరా భూమికి రూ.1.80 లక్షల నుండి సుమారు రూ.2 లక్షల వరకు ఉంది. అంతేకాకుండా సాగుభూమిని నివాసాలకు మార్చెవిధంగా అయితే రెవెన్యూ వారి అనుమతితో భూమిని కన్వన్షన్ చేయాల్సి ఉంది. లేఅవుట్లు చేసి ప్లాట్లు చేస్తే సంబందిత పంచాయతీలలో అనుమతులు పొందాలి. ఇలాంటివి ఏమిలేకుండానే దొడ్డిదారిన కొందరు వ్యక్తులు వారి తెలివితేటలను ప్రదర్శించి అక్రమ మార్గన రియల్ దందాను కొనసాగిస్తూ భూములకు రెక్కలు తెప్పిస్తు ప్రభుత్వ కన్నుగప్పి కోట్లరూపాయలను చేతులు మారుస్తు ఎటువంటి రిజిస్ట్రేషన్లేకపోయినా ప్లాట్ల బిజినేస్ను సాగిస్తు ప్రభుత్వ ఆదాయానికి బారిగా గండి కొడుతున్నారు.
సామాన్యుడు కొనలేని స్థితిలో భూముల ధరలు :
ప్రస్తుతం మండల కేంద్రంలో ఇల్లులేని నిరుపేద సెంటు భూమిని కొనే పరిస్థితిలేకుండా పోయింది. మండల కేంద్రానికి పరిసర ప్రాంతంలో భూములున్న కొందరు వ్యక్తులు వాటిని ప్లాట్లుగా చేసి అమ్ముకుంటున్నారు. కుంట భూమి ధర సుమారు రూ.3 లక్షల నుండి 5 లక్షల వరకు విక్రయిస్తున్నారు. ఇలా ఎకరం భూమిని ప్లాట్లు చేసి రూ.1.20 కోట్ల నుండి 2 కోట్లవరకు అమ్ముకుంటు కుబేరులయ్యోందుకు కంకణం కట్టుకుంటున్నారు. ప్లాట్ల బిజినేస్ చాపకింద నీరులా మారుతున్నా సంబందిత శాఖల అధికారు లెవ్వరూ పట్టించుకోకపోవడంతో అనధికార రియల్ వ్యాపారులు ఇస్టానుసారంగా వ్యవహరిస్తు భూముల ధరలకు చుక్కలు చూపిస్తున్నారని సామాన్యులంటున్నారు. ఇప్పటికైనా సంబందిత శాఖల అధికారులు ఏజెన్సిలో అక్రమ లేఅవుట్లుగా చేసి నిబందనలకు విరుద్దంగా అధిక రేట్లకు ప్లాట్లను అమ్మెవారిపై చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.