Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-జూలూరుపాడు
డబుల్ బెడ్రూం ఇండ్ల పంపిణీ విషయంలో మండల రెవెన్యూ అధికారులు మీడియా సమక్షంలో బహిరంగ చర్చ జరపాలని ఎన్డీ మండల కార్యదర్శి ఏదులాపురం గోపాలరావు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఎన్డీ ఆధ్వర్యంలో ఆదివారం మండల కేంద్రంలోని సాయి ఎక్సలెంట్' స్కూల్ నందు విలేకర్ల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వం ఇండ్లు లేని నీరుపేద ప్రజలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు పంపిణీ పధకం కింద మండలంలోని పడమట నర్సాపురం గ్రామంలోని గుట్ట వద్ద 80 ఇండ్లను నిర్మించారన్నారు. లాటరి పద్ధతి ద్వారా డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కేటాయింపు 72 మంది లబ్దిదారులను ఎంపిక చేశావరన్నారు. లాటరీ పద్ధతి ఎంపిక విషయంలో ఇండ్లు లేని నిరుపేదలకు అన్యాయం జరిగిందన్నారు. అధికారులు విచారణ జరిపి డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు పొందుటకు 56 మంది అరుహులైన వారిని ఎంపిక చేసి కేటాయించారని, మిగిలిన 24 డబుల్ బెడ్ రూమ్ ఇళ్లలో అనరుహులు ఉంటున్నారన్నారు. అర్హులకు కేటాయించాలన్నారు. ఈ కార్యక్రమంలో డీవైసీ జిల్లా నాయకులు సిద్దు, గ్రామ నిరుపేదలైన కే.పద్మ, కమల, బాలాజీ, సతీష్, భవాని, సరోజా, శారద తదితరులు పాల్గొన్నారు.