Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు
నవ తెలంగాణ-ఖమ్మం రూరల్
కరోనా మహమ్మారిని నివారించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఘోరంగా విఫలం చెందాయని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు అన్నారు. మండలంలోని కాచిరాజుగుడెం, కస్నాతండా గ్రామల శాఖ మహాసభలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో నిర్వహించిన శాఖ సభల్లో నున్నా మాట్లాడుతూ కరోనాను కట్టడి చేయడంలో మోడీ రెండోసారి అధికారం చేపట్టాక పేదల పొట్ట కొట్టి పెద్దలకు ఊడిగం చేస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వ రంగ సంస్థలను కారుచౌకగా కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టేందుకు సిద్ధంగా ఉన్నారని విమర్శించారు. అనంతరం నూతనంగా ఎన్నికైన కాచిరాజుగుడెం శాఖ కార్యదర్శి కారుమంచి గురవయ్య, యల్ది మాధనమ్మ, కస్నాతండా శాఖ కార్యదర్శి భూక్య నాగేశ్వరరావులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి నండ్ర ప్రసాద్, నాయకులు పెరుమల్ల పల్లి మోహన్ రావు, బందెల వెంకయ్య, తుమ్మల శ్రీనివాసరావు, పొన్నెకంటి సంగయ్య, పొన్నం వెంకటరమణ, పొన్నం మురళి,కుక్కల సైదులు, యల్ది రాములు, రామారావు, డీవైఎఫ్ఐ నాయకులు చాంద్ పాషా, హరీష్, ఎస్ కే సైదులు, భాస్కరరావు తదితరులు పాల్గొన్నారు.