Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డాక్టర్లు, సిబ్బందిని నియమించాలి : సీపీఐ(ఎం)
నవతెలంగాణ-చర్ల
మండలం కేంద్రంతో పాటు చర్ల చుట్టూ ఉన్న 13 పంచాయతీల ప్రజలకు వైద్యాన్ని దూరంచేసే రాష్ట్ర ప్రభుత్వ చర్యలను తక్షణం విరమించుకోవాలని సీపీఐ(ఎం) మండల కార్యదర్శి కొండ చరణ్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. మండల కేంద్రంలో కమ్యూనిటీ హెల్త్ సెంటర్, సిమాంగ్ సెంటర్, ప్రసూతి వైద్య కేంద్రాన్ని వెంటనే ప్రారంభించాలని ఆయన కోరారు. ఈ సమస్య పరిష్కారం కోసం వివిధ రూపాలలో ఆందోళన పోరాటాలు చేసిన సీపీఐ(ఎం) జూలై 11 నుండి మండల కేంద్రంలో రీలే నిరాహార దీక్షలు చేస్తుందన్నారు. ఈ దీక్షలకు ప్రజలు, అన్ని రకాల కుల ప్రజాసంఘాలు, రాజకీయ పార్టీలు మద్దతు ఇచ్చి ప్రత్యక్ష పోరాటంలో కలసి రావాలని విజ్ఞప్తి చేశారు.
ప్రజల గోడు పట్టని ప్రజాప్రతినిధులు : సీపీఐ(ఎం)
భద్రాచలం నియోజకవర్గం నుంచి అధికార పార్టీ తరుపునన్న ఎంపీ కవిత, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణలు అమావాస్యకు, పున్నమికి వచ్చి, రాజకీయ హావుడి చేయడం తప్పా నిజమైన ప్రజా సమస్యలను పరిష్కారం కోసం శ్రద్ధ పెట్టడం లేదు. అలాగే స్థానిక ఎమ్మెల్యే, ఇతర ప్రజా ప్రతినిధులు స్పందించి ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి సీహెచ్సీ, సీమాంగ్ సెంటర్ ద్వారా ప్రజలకు వైద్య సేవలను అందించుటకు కృషి చేయాలి. మండల కేంద్రంతో సహా 13 గ్రామ పంచాయతీల ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందుబాటులో లేకుండా ప్రభుత్వ చేసింది. ఇప్పటికే మారుమూల గిరిజన పల్లెలనుంచి వచ్చే గర్భిణీలు, జ్వర పీడితులు చర్లలో వైద్యం అందక భద్రాచలం వెళ్ళే స్థితిలేక గ్రామీణ వైద్యులను ఆశ్రయించి వేలాది రూపాయలు ఖర్చుచేస్తున్నారు.
సీపీఐ(ఎం) ముఖ్యమైన డిమాండ్స్
1) సీహెచ్సీ, సిమాంగ్ సెంటర్స్లకు అవసరమైన డాక్టర్లు, సిబ్బందిని నియమించి వైద్య సేవలు ప్రారంభించాలి. అన్ని వసతులు, వైద్య పరికరాలు సమకూర్చాలి.
2)పోస్టు మార్టమ్ కేంద్రాన్ని చర్లలోనే కొనసాగించాలి.
కాగా ఎనిమిదోవ రోజు అక్కడ ప్రెస్ క్లబ్ అధ్యక్ష, కార్యదర్శులు కొంగూరు రమణారావు, దొడ్డి హరినాగ వర్మలు సంఘీభావం తెలిపి ప్రజాపోరాటాలకు ప్రత్యక్షంగా పరోక్షంగా వెనువెంట ఉంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కేవీపీఎస్ నాయకులు మచ్చా రామారావు, వ్యాకాస నాయకులు శ్యామల వెంకటేశ్వర్లు, శరోని, సాంబ, బి.కిరణ్ , సతీష్, వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.