Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు కాసాని
నవతెలంగాణ-పాల్వంచ
ప్రభుత్వ రంగ సంస్థలను కారు చౌకుగా పెట్టబడిదారులకు అమ్ముత్తన్న బీజేపీ ప్రభుత్వం దానికి ఊడిగం చేస్తూ ప్రజా సమస్యలు పట్టించుకోని టీఆర్ఎస్ ప్రభుత్వంపై పోరాటాలకు సిద్ధం కావాలి సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు కాసాని ఐలయ్య అన్నారు. ఆదివారం పాల్వంచ పట్టణం మంచికంటినగర్లో 3, 4 శాఖ మహాసభలను ఆయన ప్రారంభించారు. ప్రారంబ సందర్భంగా సీనియర్ నాయకుడు 4వ శాఖ కార్యదర్శి ఎన్.సోమలింగం పతకా ఆవిష్కరణ చేసారు. ఈ మహాసభలకు ముఖ్య అతిధిగా హజరైనా కాసాని మాట్లడుతూ నిరంతరం ప్రజల పక్షాణ సీపీఐ(ఎం) నిలుస్తుందని కరోనా సమయంలో దాన్ని ఎదుర్కోని ప్రజలకు అండగా నిబడింది మార్స్కిస్టు పార్టీ కార్యకర్తలే అన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాకి ఆదర్శమైయిన పోరాటాల పురటి గడ్డ మంచికంటి నగర్ అని ఈ ప్రాంతంలో పార్టీ అభివృద్ధికి పోరాటాలు ఉధృతం చేయాలని వారు పిలపు నిచ్చారు. అనంతరం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు, పట్టణ కార్యదర్శి దోడ్జా రవికూమార్ మాట్లడూతూ మంచికంటి నగర్ ప్రజల పట్ల స్థానిక శాసన సభ్యులు తీవ్ర నిర్లక్షం చేస్తున్నారని మంచికంటినగర్ ఏర్పడి 17సంవత్సరాలు అవుతున్నా ప్రజలకు కిన్నెరసాని పైపు లైన్ ఏర్పాటు చేయలేదన్నారు. ఇప్పటికైయినా స్పందించి పైపు లైను ఏర్పాటు చేయాలని లేనిచో పోరాటాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. పార్టీ జిల్లా కమిటీ సభ్యులు యం. జ్యోతి మాట్లడుతూ పోరాటలకు పుట్టినిల్లు అయిన మంచికంటి నగర్లో పార్టీని బలోపితం కోసం ప్రతి కార్యకర్త కృషి చేయాలన్నారు. ఈ మహసభలో పార్టీ పట్టణ కమిటీ సభ్యులు మేరుగు ముత్తయ, గూడేపూరి రాజు, కె.సత్యా, వి.వాణి, రహీం, సీనీయర్ సభ్యులు కృష్ణమూర్తి, 3వ శాఖ కార్యదర్శి రాములు, పార్టీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
సుజాతనగర్ ప్రజా సమస్యలపై క్షేత్రస్థాయిలో ప్రజా ఉద్యమాలను నిర్వహించాలని సీపీఐ(ఎం) రాష్ట్ర నాయకులు కాసాని ఐలయ్య అన్నారు. ఆదివారం సిరిపురం గ్రామ ఏడవ శాఖ కె.శ్రీధర్ రాజు అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వారు పాల్గొని మాట్లాడుతూ పాలక పార్టీలు అధికారమే పరమావధిగా పని చేస్తున్నాయని అన్నారు. కమ్యూనిస్టు దేశాలు కరోనా కష్టకాలంలో ప్రజలకు అండగా నిలిచారని, కేరళ ప్రభుత్వం పౌర సరఫరాల ద్వారా 16 రకాల నిత్యావసర సరుకులను ప్రతి కుటుంబానికి పంపిణీ చేసిందని అన్నారు. కానీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల ప్రాణాలతో చలగాటం ఆడారని ఆవేదన చెందారు. సీపీఐ(ఎం) దేశవ్యాప్తంగా పార్టీ కార్యాలయాలను ఐసోలేషన్ కేంద్రాలుగా మార్చారని కమ్యూనిస్టు పార్టీ కార్యకర్తలు కూరగాయలు, నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మిల్లర్లు కుమ్మక్కై రైతులు పండించిన ధాన్యానికి క్వింటాళ్లకు 20 కేజీల చొప్పున తరుగు తీశారని, ఈ దోపిడీని సీపీఐ(ఎం) తీవ్రంగా ఖండిస్తుందన్నారు. మంత్రి నిరంజన్ రెడ్డి యువతకు ఉద్యోగాలు చూపించలేక హమాలి పని చేసి బతుకు అనటం సిగ్గుచేటని ఆయన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల కార్యదర్శి వీర్ల రమేష్, తిరుపతిరావు, శ్రీను, కృష్ణ, పద్మ, శ్రీకాంత్, సత్యం, వీరబాబు, అశోక్ తదితరులు పాల్గొన్నారు.