Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నిర్వాసితులకు అన్యాయం...
- పశువుల కొట్టాల స్ధలాలు రికార్డెడ్‌గా ఇవ్వని యాజమాన్యం
- కూల్చివేస్తున్న మున్సిపాలిటీ అధికారులు
- లబోదిబో మంటున్న బాధితులు
- ఆర్డీిఓను అడగాలి : ఎస్టేట్ అధికారి
- గ్రీన్బెల్ట్కోసం రిజిస్టర్ చేసి యాజమాన్యమే ఇచ్చింది : కమిషనర్
నవతెలంగాణ-ఇల్లందు
గత 9 సంతవత్సరాల క్రితం ఆర్ఆర్ ప్యాకేజిలో నిర్వాసితులకు పశువుల కొట్టాల కింద సింగరేణి యాజమాన్యం స్ధలాలు చూపించి చేతులు దులుపుకుంది. రికార్డెడ్‌గా ఇవ్వక పోడంతో మున్సిపాలిటీ అధికారులు పశువుల షెడ్లను కూల్చివేశారు. దీంతో బాధితులు మద్ధి జయప్రకాష్, సుతారి శ్రీను, శంకర్, కమల్ పాసి, సుందర్‌లాల్, లక్ష్మి తదితరులు లబోదిబోమంటున్నారు. వివరాల్లోకి వెలితె... 2010లో మున్సిపాలిటీలోని పాత వార్డులైన 19, 20, 21లను జెకె ఓసిలో కలుపుకోవడానికి యాజమాన్యం నిర్ణయించింది. సర్వేలు చేసిన అనంతరం 2012లో 1450 మంది నిర్వాసిత కుటుంబాలను గుర్తించారు. ఇల్లు కట్టుకోవడానికి 75 గజాల స్ధలంతోపాటు రూ.1.44లక్షలు ప్యాకేజి ఇచ్చారు. మేకలు, గేదెలు, ఆవులపై ఆధారపడి జీవనం గడుపుతున్నవారికి ప్రత్యేకంగా పశువుల కొట్టాలు నిర్మించుకోవడానికి ఎస్టేట్ ఆఫీసర్ ఆధ్వర్యంలో యాజమాన్యం స్ధలాలు చూపించారు. రికార్డెడ్‌గా ఇవ్వమని కోరితే ఇది సింగరేణి స్థలం ఎవరూ ఏమీ అనరు పశువుల పాకలు వేసుకోండని చెప్పినట్టు బాధితులు తెలిపారు.
పశువుల షెడ్ వేసుకోవడానికి ఆర్ఆర్ ప్యాకేజిలో రూ.15వేలు కలిపి 1.59లక్షలు యాజమాన్యం ఇచ్చింది. నిర్వాసిత కాలనీ ఏర్పాటు చేశారు. అనంతరం నిర్వాసిత కాలనీలో సుమారు 15వందల కుటుంబాలు ఉన్నాయి. దీన్ని రెండు వార్డులుగా విభజించారు. 12, 13 వార్డులుగా చేసి మున్సిపాలిటీలో కలిపారు. ఆర్ఆర్ కాలనీని సింగరేణి యాజమాన్యం మున్సిపాలిటీకి అప్పగించింది. దీంతో నిర్వాసితుల పశువుల కొట్టాలను మున్సి పాలిటీ ఆధ్వ ర్యంలో సిబ్బంది కూల్చి వే శారు. సమస్యను బాధితులు యా జమా న్యం దృష్టికి తీసు కుపోగా పట్టిం చుకో లేదు.
కమిష నర్, చైర్మన్ దృష్టికి తీసుకెళ్ళగా సింగరేణి యా జామన్యం పశువుల కొట్టాలకు స్ధలాలు ఇచ్చి నట్టు డ్యాకుమెంట్లు చూపి ంచమని అడుతున్నారని బాధితులు తెలిపారు. దీంతో యా జమాన్యం అన్యాయం చేసిందంటూ బాధితులు జిల్లా కలెక్టర్, ఎస్సీ, ఎస్టీ, మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేశాయి.
ఆర్డీఓను అడగాలి : ఎస్టేట్ అధికారి
జెకె ఏరియా ఎస్టేట్ అధికారిణి సునితను నవతెలంగాణ వివరణ కోరింది. స్పందించారు. పశువుల కట్టాలకు సంబంధించిన స్ధలాలు ఆర్డీఓను అడగాలన్నారు. ప్రస్తుతం లీవులో ఉన్నట్లు పేర్కొన్నారు. కోయగూడెం ఎస్టేట్ అధికారికి ఫోన్ చేయగా లిఫ్ట్ చేయలేదు.
గ్రీన్బెల్ట్కోసం రిజిస్టర్ చేసి యాజమాన్యమే ఇచ్చింది : కమిషనర్
ఆర్ఆర్ కాలనీలో నిర్వాసితులకు పశువుల కొట్టల కింద సింగరేణి యాజమాన్యం స్ధలాలు ఇచ్చినట్టు బాధితులు చెబుతున్నారు. వారి వద్ద ఎలాట్మెంట్ ఆర్డర్ కాఫీలు ఏమి లేవని మున్సిపల్ కమిషనర్ ఆళ్ళ శ్రీనివాసరెడ్డి నవతెలంగాణకు తెలిపారు.
ఆర్ఆర్ కాలనీని మున్సిపాలిటీకి యాజమాన్యం అప్పగించింది. 7 ఎకరాలు గ్రీన్ బెల్డ్ కింద రిజిస్టర్ చేసి యాజమాన్యమే ఇచ్చింది. ఇది డీసీసీ లేఅవుట్ అప్రువల్. గ్రీన్ బెల్ట్ కింద 7 ఎకరాల్లో మొక్కలు నాటాలి. ఈ స్ధలంలో చట్ట ప్రకారం మున్సిపాలిటీ కూడ ఏ రకమైన కట్టడాలు కట్టడానికి అవకాశం లేదన్నారు.