Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సంతాప సభలో సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం
నవ తెలంగాణ- ఖమ్మం
నిబద్ధతగల కమ్యూనిస్టు పొదిల భూషయ్య అని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. ఖమ్మంలోని టేకులపల్లిలో పార్టీ సీనియర్ నాయకులు పొదిల భూషయ్య కరోనాతో మృతిచెందారు. సోమవారం సంతాప సభను పార్టీ ఖానాపురం హవేలి కార్యదర్శి దొంగల తిరుపతిరావు అధ్యక్షతన జరిగింది. ఈ సభలో తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ భూషయ్య1980 నుండీ పార్టీలో చురుకైన పాత్ర పోషించాడని, మధ్యతరగతి రైతు కుటుంబంలో పుట్టి పేదల సమస్యల పై నిరంతరం పనిచేసే వాడని, మహిళలు, కార్మికులు, రైతులు, కూలీల సమస్యలపై నిరంతరం పోరాటాల్లో పాల్గొనేవాడని, పార్టీ ఆశయాలు ముందుకు తీసుకుపోవడం కోసం బాగా కృషి చేశాడన్నారు. అలాంటి నాయకున్ని కోల్పోవడం పార్టీకీ తీరని లోటు అన్నారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పోతినేని సుదర్శన్ రావు మాట్లాడుతూ చివరి శ్వాస వరకు పార్టీని నమ్ముకుని పార్టీకి ఎనలేని సేవ చేశారని అన్నారు. ఆయన మృతి పార్టీకి తీరనిలోటన్నారు. సంతాప సభలో సిపిఎం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు, రాష్ట్ర కమిటీ సభ్యులు ఎర్రా శ్రీకాంత్, ఎం సుబ్బారావు, మాచర్ల భారతి, జిల్లా సెక్రటేరియట్ నెంబర్ బుగ్గవీటి సరళ, బండి రమేష్, డిసిసిబి చైర్మన్ కూరాకుల నాగభూషణం, జిల్లా కమిటీ సభ్యులు బండి పద్మ, మల్సూర్, పారుపల్లి ఝాన్సీ, పి ఎన్ ఎం జిల్లా నాయకులు దేవేంద్ర, ఖానాపురం హవేలీ సిపిఎం కార్యదర్శి దొంగల తిరుపతిరావు, గ్రామ కార్యదర్శి పోతురాజు వెంకట్, సీనియర్ నాయకులు ధనియాకుల నాగేశ్వరరావు పెద్ది నాగయ్య, దొంగల కోటయ్య, వై.వి నారాయణరావు, గొర్రెల మేకల సంఘం జిల్లా నాయకులు మేకల నాగేశ్వరరావు, ఎర్ర బోయిన గోవిందం సిఐటియు జిల్లా నాయకులు పిన్నింటి రమ్య, మండల కమిటీ మెంబర్స్ దంతాల కేశవులు, కె.వెంకటస్వామి, నెల్లుట్ల వెంకన్న,, సత్తెనపల్లి శ్రీను, తోట నాగరాజు, అమరావతి, పందుల నాగమణి, పిఎన్ఎం నాయకులు ఆర్ కోటేశ్వరరావు, వేదగిరి మురహరి చిలకల రామ నరసయ్య, ఎస్.కెట జాఫర్ మియా, మహిళా నాయకులు భూక్య సరస్వతి చిలకల సునీత పాల్గొన్నారు.
రామచంద్ర కుటుంబానికి తమ్మినేని పరామర్శ
నవతెలంగాణ- తిరుమలాయపాలెం
మండలంలోని పిండిప్రోలు గ్రామంలో ఇటీవల అనారోగ్యంతో చనిపోయిన తాత పెద్ద రామచంద్ర కుటుంబాన్ని సోమవారం సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పరామర్శించారు. తాతా రామచంద్రయ్య ఫోటోకి పూలమాలలు వేసి నివాళులర్పిం చారు . తాత కుటుంబాన్ని పరామ ర్శించిన వారిలో నవతెలంగాణ జనరల్ మేనేజర్ ఎం.సుబ్బా రావు, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పోతినేని సుదర్శన్ రావు, సిపీఎం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు, సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బండి రమేష్, కొమ్ముశ్రీను తదితరులు పాల్గొన్నారు .