Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ముదిగొండ
ప్రజల కోసం, పార్టీ కోసం నిస్వార్ధంగా పనిచేసిన ప్రజానాయకుడు, ధన్యజీవి, త్యాగశీలి, కమ్యూనిస్టు పార్టీ యోధుడు, సిపిఎం నాయకులు అమరజీవి పోతుల పుల్లయ్యని సిపిఎం రాష్ట్ర కమిటీ నాయకులు పొన్నం వెంకటేశ్వరరావు అన్నారు. బాణాపురంలో పోతుల పుల్లయ్య స్థూపాన్ని సోమవారం పొన్నం ఆవిష్కరించారు. ఈసందర్భంగా పార్టీ మండల కమిటీ సభ్యులు పి రాంబాబు అధ్యక్షతన జరిగిన సభలో పొన్నం మాట్లాడుతూ పోతుల పుల్లయ్య ఈ ప్రాంతంలో జరిగిన కమ్యూనిస్టు ఉద్యమాలలో... కూలి పోరాటంలో కీలక పాత్ర పోషించి ధన్యజీవిగా చరిత్రలో నిలిచారన్నారు. రాష్ట్రంలో కేసీఆర్ దళితులకు 3ఎకరాల భూమి ఇస్తానని ఆ మాట అటకెక్కించి దళిత సాధికారత పేరుతో ఉపఎన్నికల రాగం పేరుతో మరో కొత్త డ్రామాకు తెరలేపారని ఆయన ధ్వజమెత్తారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రజావ్యతిరేక విధానాలపై ప్రజలను చైతన్యవంతులను చేసేందుకు ప్రజా ఉద్యమాలను విరివిగా చేసి పోతుల పుల్లయ్య స్పూర్తిని ముందుకు తీసుకెళ్లాలని ఆయన అన్నారు. కార్యక్రమంలో సిపిఎం పార్టీ సీనియర్ నాయకులు రాయల వెంకటేశ్వర్లు, పార్టీ జిల్లా నాయకురాలు బండి పద్మ, మండల పార్టీ కార్యదర్శి వాసిరెడ్డి వరప్రసాద్, నాయకులు బట్టు పురుషోత్తం, మంకెన దామోదర్, టీఎస్ కళ్యాణ్, వేల్పుల భద్రయ్య, పాలవాయి పాండురంగారావు, మరికంటి వెంకన్న, కొల్లేటి ఉపేందర్, మర్లపాటి వెంకటేశ్వరావు, సొసైటీ డైరెక్టర్ రాయల శ్రీనివాసరావు, పార్టీ గ్రామశాఖ కార్యదర్శి చింతకాయల రామారావు తదితరులు పాల్గొన్నారు.