Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డీసీసీబీ చైర్మన్ కూరాకుల నాగభూషణం
నవతెలంగాణ- బోనకల్
జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ ప్రస్తుతం రూ.14 కోట్ల లాభాలలో ఉందని డిసిసిబి చైర్మన్ కూరాకుల నాగభూషణం తెలిపారు. బోనకల్ ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘంలో సోమవారం గోల్డ్ రుణం కౌంటర్‌ని కురాకుల నాగభూషణం ప్రారంభించారు. అనంతరం బోనకల్ సహకార సంఘం అధ్యక్షులు చావా వెంకటేశ్వర రావు అధ్యక్షతన జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ చైర్మన్ గా తాను పదవీ బాధ్యతలు స్వీకరించే నాటికి డిసిసిబి రూ.7 కోట్ల అప్పులో ఉందన్నారు. రూ.140 కోట్ల గోల్డ్ రుణాలు ఉండగా ప్రస్తుతం రూ.230 కోట్లు గోల్డ్ రుణాలు ఇచ్చినట్లు తెలిపారు. సహకార సంఘం అధ్యక్షులు తమ సొసైటీకి 10 లక్షలు మాత్రమే ఇచ్చారని రైతులకు సరిపోవటం లేదని, మరో రూ.20 లక్షలు ఇవ్వాలని కోరగా అందుకు ఆయన స్పందిస్తూ గతంలో నాబార్డు నుంచి వంద కోట్లు తీసుకువచ్చి 100 సహకార సంఘాలకు పంపిణీ చేశామని కానీ కరోనా వల్ల రైతులు తీసుకున్న రుణాలను చెల్లించ లేనందువలన నాబార్డుకు 100 కోట్లు డీసీసీబీ నుంచి చెల్లించవలసి వచ్చిందని, అవకాశం ఉంటే తప్పనిసరిగా పరిశీలించి అదనంగా ఇస్తామని హామీ ఇచ్చారు. బోనకల్లు సొసైటీ నుంచి 95 శాతం వడ్డీ వసూలు చేశామని, అదేవిధంగా డిపాజిట్ ద్వారా నాలుగు కోట్లు సేకరించినట్లు చావా వెంకటేశ్వరరావు ఆయనకు తెలిపారు.
వ్యవసాయం కోసం రైతులు గోల్డ్ రుణాలు తీసుకుంటున్నారా: జడ్పీ చైర్మెన్
గ్రామీణ ప్రాంతాలలో వ్యవసాయం కోసం ఇంకా రైతుల గోల్డ్ రుణాలు తీసుకుంటున్నారా అని జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు, రైతు సమన్వయ సమితి జిల్లా కన్వీనర్ నల్లమల వెంకటేశ్వరరావు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవసాయానికి పెట్టుబడి కోసం ఎకరానికి ఒక పంటకు ఐదు వేల రూపాయల చొప్పున రెండు పంటలకు పదివేల రూపాయలు ఇస్తున్నారని తెలిపారు. కార్యక్రమంలో డిసిసిబి బోనకల్ బ్రాంచ్ మేనేజర్ దుర్గాదేవి, సొసైటీ ఉపాధ్యక్షుడు చావా వెంకటేశ్వరరావు, బోనకల్ సర్పంచ్ బుక్యా సైదానాయక్, మండల పరిషత్ ఉపాధ్యక్షుడు గుగులోత్ రమేష్, రైతు సమన్వయ సమితి మండల కన్వీనర్ వేమూరి ప్రసాదరావు, సహకార సంఘం సీఈవో మండెపూడి వెంకటేశ్వరరావు, మాజీ సొసైటీ అధ్యక్షులు గుండపనేని సుధాకర్‌రావు, యార్లగడ్డ చిన్న నరసింహ సొసైటీ డైరెక్టర్లు బిల్లా విశ్వనాథం, మోర్ల శ్రీనివాస్‌రావు, మాజీ జెడ్పిటిసి బానోత్ కొండ, టిఆర్ఎస్ నాయకులు మందడలపు తిరుమలరావు, కాకాని శ్రీనివాసరావు, షేక్ హుస్సేన్ సాహెబ్, చిలక వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.