Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ములకలపల్లి
అర్హులైన రైతులందరి రుణాలను తక్షణం ఒకే దఫా మాఫీ చేయాలని తెలంగాణ రైతు సంఘం జిల్లా నాయకులు అన్నవరపు సత్యనారాయణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం మండల కేంద్రంలో జరిగిన కార్యకమాన్ని ఉద్దేశించి మాట్లాడారు. వర్షాకాలం వ్యవసాయ సీజన్ ప్రారంభమైనప్పటికీ ఇప్పటివరకు బ్యాంకు రుణాలను మాఫీ చేయడంలో ప్రభుత్వం విఫలం అయిందని ఆరోపించారు. అనంతరం ఎస్బీఐ, ఏపీజీవీబీ, డీసీసీబీ మేనేజర్లకు సమస్యలతో కూడిన వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) మండల కార్యదర్శి ముదిగొండ రాంబాబు, రవికుమార్, వీరస్వామి, ప్రసాద్, చంద్రశేఖర్, శ్రీరాములు, సత్యం, లక్ష్మి, రమాదేవి పాల్గొన్నారు.
దమ్మపేట : దమ్మపేట టౌన్లో గల ఎస్బీఐ, ఏపీజీవీబీ కో-ఆపరేటివ్ బ్యాంకులు ఎదుట సోమవారం తెలంగాణ రైతు సంఘం మండల కమిటీ ఆధ్వర్యంలో బ్యాంకులలో రైతులకు ఎదరువుతున్న సమస్యల గురించి ధర్నా చేశారు.
అనంతరం డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని సమర్పించారు. మేనేజర్లకు వినతి పత్రాలను సమర్పించారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం మండల నాయకులు దొడ్డా లకిëనారాయణ, శ్రీనివాసరావు, అప్పారావు, కుటుంబరావు, నారాయణ, నాగేంద్రరావు తదితరులు పాల్గొన్నారు.
కొత్తగూడెం రాష్ట్ర ప్రభుత్వం రైతులకు రుణమాఫీ డబ్బులు వెంటనే విడుదల చేయాలని రైతు సంఘం లక్మి దేవిపల్లి మండల కార్యదర్శి వాంకుడోత్ కోబల్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర కమిటీ బ్యాంకుల ముందు ధర్నాలు చేయాలని పిలుపు మేరకు సోమవారం ఐఓబీ బ్యాంకు ముందు ధర్నా నిర్వహించి మేనేజర్‌కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రౖతులకు కొత్త రుణాలు విషయంలో రైతులకు తన వంతు కృషి చేస్తానని మేనేజర్ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో రైతులు వి.నాగేశ్వరరావు, ఎన్.సత్యనారాయణ, వాంకుడోత్ అమర్ సింగ్, డి.వెంకన్న, కుంజ లక్మయ్య, సురేష్, వెంకన్న తదితరులు పాల్గొన్నారు.