Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జర్నలిస్టుల ఐక్యత వర్ధిల్లాలి అంటూ నినాదాలు
- చర్యలు తీసుకోవాలంటూ కలెక్టర్‌కు వినతి
నవతెలంగాణ-కొత్తగూడెం
జర్నలిస్టులపై రాజకీయ గుండాయిజం నశించాలని ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడిమా ప్రదర్శన నిర్వహించారు. స్థానిక బస్టాండ్ సెంటర్లోని అమర వీరుల స్థూపం వద్ద పెద్దఎత్తున నిరసన కార్యక్రమం చేశారు. కలెక్టరేట్ వరకు ప్రదర్శన నిర్వహించారు. కలెక్టరేట్ ముందు ఆందోళన చేపట్టారు. పెద్దపెట్టున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా పాత్రికేయులు మాట్లాడారు. నియోజకవర్గ సమస్యల పట్ల న్యూస్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రజలు ప్రతిపక్షాల సమక్షంలో (డిబేట్) చర్చావేదిక కార్యక్రమం నిర్వహించారు. కానీ అదే ప్రాంతానికి చెందిన నియోజకవర్గ అధికార పార్టీ ఎమ్మెల్యే సైదిరెడ్డి అనుచరులు చర్చ ప్రారంభానికి ముందే న్యూస్ మీడియా సిబ్బందిపై దౌర్జన్యంకి దిగడం ధారుణం అన్నారు. దాడులకు పాల్పడిన రాజకీయ గుండాలను అరెస్టు చేయాలని, జర్నలిస్టులపై జరుగుతున్న దాడుదలను అరికట్టేందుకు ప్రత్యే చట్టం తేవాలని, విచారణ నిర్వహించి వేంటనే కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్టులు జునమాల రమేష్, ఇమంది ఉదరు కుమార్, మోటమర్రి రామకష్ణ, ఉదరు రాజ్, రాజేందర్, ప్రభాకర్ రెడ్డి, షఫీ, సుధాకర్, ఎర్ర ఈశ్వర్, సతీష్, జంపన్న భాస్కర్, ఈశ్వర్, అస్లాం, రామకృష్ణ, సామ్సన్ రాజు, అఫ్జల్, రత్నకుమార్, శ్రీనివాస్, రాజ్ కుమార్, సదానందం, రామారావు, శేఖర్, రవి ఆర్కె, బాబు, శ్రీనివాస్, రవి తదితరులు పాల్గొన్నారు.
భద్రాచలం : హుజూర్ నగర్లో జర్నలిస్టులపై దాడిని ఖండిస్తూ సోమవారం జర్నలిస్టుల జేఏసీ ఆధ్వర్యంలో భద్రాచలంలో జర్నలిస్టులు ధర్నా నిర్వహించారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ సబ్ కలెక్టర్‌కు, పట్టణ సీఐ స్వామిలకు వినతి పత్రాలు అందజేశారు. అలాగే అంబేద్కర్ సెంటర్ వద్ద నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమం జర్నలిస్టు జేఏసీ నాయకులు మొబగాపు ఆనంద్, శ్రీపాద శ్రీధర్, తోకల నాగేశ్వరరావు, దిలీప్ కుమార్, మోహన్ రావు, సత్యానంద్, శ్రీనివాస్, బి.సత్యనారాయణ, శ్రీనివాసరావు, దుర్గారెడ్డి, జగన్, జె.శ్రీనివాస్ రెడ్డి, దుర్గా ప్రసాద్ రెడ్డి, జైపాల్, రాజేష్, రామ్, శేఖర్, మున్న హర్ష, తదితరులు పాల్గొన్నారు.
చండ్రుగొండ హుజూర్ నగర్లో నిర్వహించిన పబ్లిక్ డిబేట్ కార్యక్రమంలో విలేఖరులపై జరిగిన దాడి హేయమైన చర్య అని, దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని చండ్రుగొండ పెన్ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు ఎస్కే జాఫర్ డిమాండ్ చేశారు. సోమవారం జర్నలిస్ట్‌పై జరిగిన దాడికి నిరసనగా జర్నలిస్టులు అందరూ నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం తహసీల్దార్ ఎం.ఉష శారదకు వినతిపత్రం అందజేసి జాఫర్ మాట్లాడారు. సమాజంలో ఉన్న సమస్యలు ఎత్తిచూపుతున్న విలేఖరులపై దాడులు చేయడం హేయమైన చర్య అన్నారు. ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి కుంజా వెంకటేశ్వర్లు, పెన్ ప్రెస్ క్లబ్ సభ్యులు కృష్ణ ప్రసాద్, రాంబాబు, గణేష్, శివనాగిరెడ్డి, శివా, వినోద్, తదితరులు పాల్గొన్నారు.
ఇల్లందు : హుజురాబాద్‌లో జర్నలిస్టులపై దాడి దారుణమని ఐజేయు నాయకులు సుమంత్, నర్సి, గుడివాడ శ్రీనివాస్, ఎల్ వీర మోహన్, గడ్డం వెంకటేశ్వర్లు తీవ్రంగా ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు.
త్వరలో జరుగనున్న ఉప ఎన్నికలపై డిబేట్ కార్యక్రమం నిర్వహిస్తున్న రాజ్ న్యూస్ జర్నలిస్టులు, సిబ్బందిపై కొంతమంది అల్లరిమూకలు దాడి చేయడం హేయమైన చర్య అన్నారు. ఇలాంటి దాడులు పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
మణుగూరు : జర్నలిస్టులపై భౌతిక దాడులు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని మణుగూరు జర్నలిస్టులు డిమాండ్ చేశారు. సోమవారం తహసీల్దార్ కార్యాలయంలో జాయింట్ కలెక్టర్ వెంకటేశ్వరరావుకు వినతి పత్రం అందజేశారు. అనంతరం వారు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో జర్నలిస్టులు పాల్గొన్నారు.