Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రభుత్వానికి ప్రజల ప్రాణాలంటే లెక్కలేదు : ఎమ్మెల్యే పొదెం
- రిలే దీక్షలను విరమించాం, పోరాటం ఆగదు : బ్రహ్మచారి
నవతెలంగాణ-చర్ల
కమ్యూనిటీ హెల్త్ సెంటర్, సిమాంగ్ సెంటర్ ప్రారంభించే దాకా ఐక్యంగా పోరాడాలని, రాష్ట్ర ప్రభుత్వంపైన అసెంబ్లీలో సైతం ఒత్తిడి తెచ్చి ప్రజా వైద్య మెరుగుపరిచేందుకు కృషి చేస్తానని భద్రాచలం అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే పొదెం వీరయ్య పిలుపునిచ్చారు. సోమవారం తొమ్మిది రోజుల పాటు సీపీఐ(ఎం), కేవీపీఎస్, వ్యాకాస నేతృత్వంలో జరిగిన దీక్ష శిబిరాని సందర్శించి, దీక్షా పరులతో మాట్లాడి, ఈ సమస్యపై తాను సైతం పోరాడుతానని, ఈ ప్రాంత ప్రజలకు మంచి వైద్యం అందించడం 'నా బాధ్యత' అని ఎమ్మెల్యే అన్నారు. కావున మీరు దీక్ష విరమించి సహకరించాలని కోరి, నిమ్మరసం తాగి ంచి దీక్ష విరమింపజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వానికి ప్రజల ప్రాణా లు లెక్క లేవని ఆయన ధ్వజమెత్తారు. 2012-2013లో చర్లకు మంజూరైన కమ్యూనిటీ హెల్త్ సెంటర్ను తెలంగాణ ప్రభుత్వం ఎక్కడికి తరలిం చిదో సమాధానం చెప్పాలని అని ఆయన డిమాండ్ చేశారు. ఏజెన్సీలో నిరుపేదలకు వైద్యం అందించా లనే చిత్తశుద్ధి లేదా అని ఆయన నిప్పులు చెరిగారు.
ఈ కార్యక్రమంలో నల్లపు దుర్గాప్రసాద్, వెంకటేశ్వర్లు, గూడ పాటి సతీష్, మచ్చా రామారావు, శ్యామల వెంకటేశ్వర్లు, శరోని, చంటి, లక్ష్మీ, సమ్మక్క, వినోద్, రజనీకాంత్, సాంబ, సతీష్ కౌశిక్, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.