Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తెలంగాణ ఇంజనీర్స్ జేఏసీ నాయకుల హెచ్చరిక
- వినియోగదారులకే తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం
- జేఏసీ ఆధ్వర్యంలో నిరసన, ధర్నా
నవతెలంగాణ-పాల్వంచ
పార్లమెంట్ సమావేశాల్లో 2021 విద్యుత్ సవరణ బిల్లును ప్రవేశపెడితే ప్రతిఘటిస్తామని దేశవ్యాప్తంగా సమ్మెకు సిద్ధం అవుతామని తెలంగాణ ఇంజనీర్స్ ఆల్ యూనియన్స్ నాయకులు కేంద్ర ప్రభుత్వానికి హెచ్చరించారు. విద్యుత్‌రంగంలో కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రైవేటీకరణ విధానాలకు వ్యతిరేకంగా నేషనల్ కోఆర్డినేషన్ కమిటీ ఆఫ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ ఇంజనీర్స్ (ఎన్సీసీిఓఈఈఈ) దేశవ్యాప్త పిలుపుమేరకు పాల్వంచలోని కొత్తగూడెం ధర్మల్ పవర్ స్టేషన్ విద్యుత్ ఉద్యోగులు, ఇంజనీర్లు నల్లబ్యాడ్జీలను ధరించి కేటీపీఎస్ అంబేద్కర్ సెంటర్లో భారీ నిరసన ధర్నా విజయవంతంగా నిర్వహించారు. ప్లకార్డులను ప్రదర్శిస్తూ విద్యుత్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా భారీ నినాదాలు చేశారు. ఈ సందర్బంగా జేఏసీ నాయకులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తక్షణమే విద్యుత్ సవరణ బిల్లు 2021ను ఉపసంహరించుకోవాలని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలో విద్యుత్ సంస్థల ప్రైవేటీకరణ చర్యలు నిలిపివేయాలని డిమాండ్ చేశారు. కొన్ని రాష్ట్రాల్లో ఇప్పటికే విద్యుత్‌రంగంలో కొనసాగుతున్న ప్రైవేటు విద్యుత్ లైసెన్సులను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ బిల్లుతో దిగువ స్థాయి వినియోగదారులే ఈ విద్యుత్ సవరణతో తీవ్రంగా నష్టపోతారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఇంజనీర్స్ అసోసియేషన్ నాయకులు మంగీలాల్, పివి రావు, బ్రహ్మాజి, తెలంగాణ అసిస్టెంట్ ఇంజనీర్స్ నాయకులు మహేశ్, కేమిస్ట్రీ అసోసియేషన్ నాయకులు డికే శ్రీనివాసులు, తెలంగాణ పవర్ డిప్లోమా ఇంజనీర్స్ అసోసియేషర్ నాయకులు సీతరాంరెడ్డి, హెచ్ 48 నాయకులు సతీష్‌కుమార్, 1104 యూనియన్ నాయకులు సుధీర్, 327 యూనియన్ నాయకులు అబ్దుల్ మజీద్, 1535 యూనియన్ నాయకులు పి.రాము, టిఆర్వికేఎస్ నాయకులు సిహెచ్ రమేశ్, సీఐటీయూ నాయకులు అంకిరెడ్డి నర్సింహారావు, ఏఐటీయూసీ నాయకులు ఆర్.మురళి, హెచ్ 142 యూనియన్ నాయకులు కేవి రామారావు, ఓసీ అసోసియేషన్ నాయకులు ఎస్.కోటేశ్వరరావు, బీసీ అసోసియేషన్ నాయకులు రవిందర్, ముస్లిం అసోసియేషన్ నాయకులు గౌసుద్దీన్, ఎస్సీ, ఎస్టీ అసోసియేషన్ నాయకులు నాగయ్య, కాంట్రాక్ట్ వర్క్‌ర్స్ యూనియన్ నాయకులు లకిëణ్‌నాయక్, యాస్మిన్, సమీర్ తదితరులు పాల్గొన్నారు.
మణుగూరు : కేంద్ర ప్రభుత్వం అమలు చేయనున్న విద్యుత్ బిల్లు సవరణ చట్టం రూపొంతరం చెందితే విద్యుత్ ఉద్యోగుల భద్రతకు ముప్పు వాటిల్లుతుందని విద్యుత్ సంఘాల జేఏసీ నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. సోమవారం బీటీపీఎస్ చీఫ్ ఇంజినీర్ కార్యాలయం నుండి కర్మగార ప్రధాన గేట్ వరకు కార్మిక సంఘాల నాయకులు నిరసన ప్రదర్శన నిర్వహించి బీటీపీఎస్ ఛీప్ ఇంజినీర్ పి.బాలరాజుకి వినతి పత్రాన్ని అందజేశారు. ఏఈల అసోసియేషన్ నాయకులు సిరికొండ నరేష్, కార్మిక సంఘం 1104 ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ, కార్మిక సంఘం 327 ప్రధాన కార్యదర్శి శంసుద్దీన్, 1535 యూనియన్ అధ్యక్షులు వి.ప్రసాద్, టిఆర్వికెఎస్ నాయకులు శ్రీనివాస్, బీసీ అసోసియేషన్ నాయకులు వెంకట్, కాప నాగేశ్వరరావు, సునిత, రాణి, క్రిష్ణవేణి, రమణ తదితరులు పాల్గొన్నారు.