Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మాజీ ఎంపీ మిడియం బాబురావు
నవతెలంగాణ-దుమ్ముగూడెం
రైతులు వ్యవసాయ సాగు కోసం బ్యాంకుల వద్ద తీసుకున్న రుణాల మాఫీపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి చిత్త శుద్ది లేదని మాజీ ఎంపీ, సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు డా.. మిడియం బాబురావు అన్నారు. తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా రైతు సంఘం మండల కమిటీ ఆధ్వర్యంలో ములకపాడు యలమంచి సీతారామయ్య భవన్ నుండి లకీëనగరం స్టేట్ బ్యాంకు వరకు బారీ మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించి నిరసన అనంతరం సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని బ్యాంకు సిబ్బందికి అందజేశారు. ఈ సందర్బంగా మిడియం బాబురావుతో పాటు రైతు సంఘం జిల్లా అధ్యక్షులు యలమంచి రవికుమార్ మాట్లాడారు. రైతులు బ్యాంకుల ద్వారా తీసుకున్న లక్ష లోపు రుణాలు మాఫీ చేస్తామని అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు రూ.25 వేల మాఫీని సైతం పూర్తి స్థాయిలో రైతులకు లబ్ది చేకూరలేదన్నారు. పోడు కొట్టి సాగు చేసుకుంటున్న గిరిజన రైతులకు అటవీ హక్కుల చట్టం ప్రకారం హక్కు పత్రాలు అందజేయడంతో పాటు రైతు బందు అందజేయాన్నారు. ఏజన్సీ ప్రాంతాల అభివృద్ధిపై ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు కు చిత్త శుద్ది లేదన్నారు. మండల అభివృద్ధి కోసం సిపిఐ(ఎం) రాజీ లేని పోరాటాలు చేస్తుందన్నారు. రైతు సంఘం మండల కార్యదర్శి బొల్లి సూర్యచందర్ రావు అధ్యక్షతన జరిగిన నిరసన కార్యక్రమంలో గిరిజన సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు కారం పుల్లయ్య, వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శి యలమంచి వంశీకృష్ణ, రైతు సంఘం మండల అధ్యక్షుడు యలమంచి శ్రీనుబాబు, సిఐటియు మండల కన్వీనర్ కొర్సా చిలకమ్మ, లకీëనగరం సర్పంచ్ సరియం రాజమ్మ, ఉపసర్పంచ్ గుడ్ల రాంబాబు, నాయకులు తదితరులు ఉన్నారు.