Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కుడి, ఎడమ కాలువ ద్వారా సాగునీరు విడుదల
నవతెలంగాణ-చర్ల
వ్యవసాయానికి పెద్ద పీట వేస్తామంటూ కేసీఆర్ చెప్పే మాటలు నీటి మీద రాతలేనా అని భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్య అన్నారు. సోమవారం చర్ల మండలం, పెద్ద మిడిసిలెరు గ్రామం వద్ద గల తాలిపేరు మధ్యతరహా ఇరిగేషన్ ప్రాజెక్టు నుండి ఎడమ, కుడి కాలువల ద్వారా చర్ల, దుమ్ముగూడెం మండలాలలో గల 24,700 ఎకరాల ఆయకట్టుకు సాగు చేయడానికి సాగునీరు అందించడానికి పొదెం వీరయ్య, మాజీ మంత్రి జలగం ప్రసాదరావులచే లాకులు తెరిచి, నీరు అందించే కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రపభుత్వం వ్యవసాయానికి పెద్ద ఎత్తున నిధులు ఇచ్చామని, నీటిమీద రాతలు తప్పా మూటలు ఇచ్చిన దాఖలాలు లేవన్నారు. ఉన్న ప్రాజెక్టును అధికారుల సమన్వయంతో రైతాంగం సక్రమంగా ఉపయోగిం చుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో పర్యవేక్షక ఇంజనీరు కె.వెంకటేశ్వర రెడ్డి, నల్లపు దుర్గాప్రసాద్, డీఈ తిరుపతి, ఇర్పా శాంత, ఎంపీటీసీలు పాలంచ రామారావు, తాటి జ్యోతి, ముత్యాల స్వాతి, సర్పం చులు కృష్ణార్జున రావు, రాధా, బాలకృష్ణ, నరేంద్ర, రాంబాబు, రవి, రైతులు అధికారులు పాల్గొన్నారు.