Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పోడు భూములు జోలికొస్తే ఉద్యమాలు ఉధృతం చేస్తాం
- గిరిజనులది భూ సమస్య కాదు, వారి బతికే సమస్య : కాసాని
నవతెలంగాణ-జూలూరుపాడు
మండల పరిధిలోని బొజ్జ తండా గ్రామానికి చెందిన 26 కుటుంబాలు సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు కాసాని ఐలయ్య, జిల్లా కార్యదర్శి అన్నవరపు కనకయ్య ఆధ్వర్యంలో సోమవారం చేరాయి. అనంతరం గ్రామంలో గ్రామస్తులు పార్టీ దిమ్మెను నిర్మించారు. కాసాని ఐలయ్య పార్టీ జెండాని ఆవిష్కరించారు. బానోత్ ధర్మ అధ్యక్షతన జరిగిన సమావేశంలో కాసాని, కనకయ్య మాట్లాడారు. దేశం, రాష్ట్రంలో దేశ ప్రజలకు ప్రత్యయము మార్కిస్టు పార్టీ అని అన్నారు. బొజ్జ తండా ప్రజలకు వారు సమస్యలు పరిష్కరించుకోవడానికి 26 కుటుంబాలు పార్టీలో చేరాయన్నారు. రాష్ట్రం, దేశంలో జీవించటానికి ప్రశ్నించే హక్క లేకుండా పోయిందని అన్నారు. రాష్ట్రంలో తెరాస రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో వాగ్దానాలు ఒక్కటి కూడా నెరవేర్చలేదన్నారు. మోడీ ప్రభుత్వం ఏకపక్షంగా బలవంతంగా తీసుకు వచ్చిన మూడు వ్యవసాయ చట్టం తక్షణమే రద్దు చేయాలని అన్నారు. పోడు భూములు జోలికి వస్తే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. పార్టీలో చేరిన కుటుంబాలకు పార్టీ జండా కప్పి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో జాటోత్ కృష్ణ, మండల కార్యదర్శి భిక్షం, మండల నాయకులు వెంకటి, భానోత్ ఇశ్రా, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.