Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి కనకయ్య
నవతెలంగాణ-పాల్వంచ
దోపిడీ లేని సమాజమే మా లక్ష్యం, దానికోసం ఉధృతమైన పోరాటాలు నిర్మిస్తాం అని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి అన్నవరపు కనకయ్య అన్నారు. సోమవారం పాల్వంచ పట్టణం మంచికంటినగర్ 1, 2 శాఖ మహాసభలను ప్రారంభించారు. ఈ మహాసభల ప్రారంబంలో పార్టీ టౌన్ కమిటీ సభ్యులు ఎస్కే.నిరంజన్ పతాక ఆవిష్కరణ చేసారు. అనంతరం కనకయ్య మాట్లాడారు. దేశం, రాష్ట్రంలో ప్రభుత్వాలు ప్రజా సమస్యలు పట్టించుకోవడం లేదని మరో వైపు ప్రజలపై విపరీతమైన బారాలు మోపుతున్నాయన్నారు. అనంతరం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు, పట్టణ కార్యదర్శి దోడ్డా రవికూమార్ మాట్లడూతూ పెట్రోల్, డీజల్, గ్యాస్ ధరలు పెంచుతూ ప్రభుత్వాలు సామన్యుడి నడ్డి విరుస్తున్నాయన్నారు. పార్టీ జిల్లా కమిటీ సభ్యులు యం.జ్యోతి మాట్లాడారు. మంచికంటి నగర్ ప్రజలకు స్మశాన వాటిక ఏర్పటు చేసి కిన్నెరసాని పైపు లైను ఏర్పాటు చేసి ప్రజల దాహర్తిని తీర్చాలన్నారు. ఈ మహసభలో పార్టీ పట్టణ కమిటీ సభ్యులు మేరుగు ముత్తయ్య, కె.సత్యా, వి.వాణి, శాఖ కార్యదర్శి శ్యామల రమా, పార్టీ సభ్యులు నర్సయ్య, సత్యనారయణ, లక్ష్మి, రామా చారి తదితరులు పాల్గోన్నారు.