Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జేవీఆర్ ట్రస్టు చైర్మన్, మాజీ మంత్రి జలగం ప్రసాదరావు
నవతెలంగాణ-దుమ్ముగూడెం
గిరిజనులను అన్ని రంగాలలో అభివృద్ధి చేయాలన్నదే తన ధ్యేయమని అందుకే తన తండ్రి జలగం వెంగళరావు ట్రస్టు ద్వారా గిరిజన రైతులకు విద్యుత్ మోటార్లను సబ్సీడీ ద్వారా అందజేయడం జరుగుతుందని జెవిఆర్ ట్రస్టు చైర్మన్, మాజీ మంత్రి జలగం ప్రసాదరావు అన్నారు. సోమవారం చిన్నబండిరేవు గ్రామంలో రైతు వాసురాజు ఇంటి వద్ద చర్ల, దుమ్ముగూడెం మండలాలకు చెందిన 30 మంది గిరిజన రైతులకు విద్యుత్ మోటార్లు, స్టార్టర్లను భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్య చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యవసాయ పంపు సెట్లు పెరుగుతున్నందున అదనంగా మరిన్ని సబ్ స్టేషన్లు ఏర్పాటు చేయడం కోసం కృషి చేస్తానని సబ్ స్టేషన్లకు అవరసమైన భూములను గుర్తించాలన్నారు. పూర్తి ఎజన్సీ ప్రాంతమైన భద్రాచలం నియోజకవర్గంలో రహదారులు, ముఖ్యంగా చత్తీష్‌ఘఢ్ రాష్ట్రానికి అంతర్గత రహదారుల కోసం ఎల్డబ్యుఇ నిధుల ద్వారా 200 కోట్ల రూపాయలు తీసుకు వచ్చి ఈ ప్రాంత అభివృద్ధి కృషి చేస్తానన్నారు. ఇంటర్ పాసైన గిరిజన విద్యార్దినులు ఎవరైనా ఉంటే వారికి ఉచితంగా నర్స్ ట్రైనింగ్ ఇప్పించడంతో పాటు అవరమైతే వారికి ఉద్యోగాలు ఇప్పించే బాద్యత సైతం తానే తీసుకుంటానని తెలిపారు.
తాలిపేరు డివిజన్ ను తిరిగి సత్యనారాయణపురంలో ఉండేలా సంభందిత అధికారులతో మాట్లాడతానని ఆయన తెలిపారు. గిరిజనుల పోడు భూములకు హక్కులు కల్పించాలనే ఏకైక లక్ష్యంతో ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు దగ్గర హామీ తీసుకుని టీఆర్ఎస్ పార్టీలో చేరానని ఈ విషయాన్ని మరలా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకు పోతానని ఆయన తెలిపారు. ఈ ప్రాంతంలో త్రీ ఫేస్ విద్యుత్ లైన్లు వేయడానికి విశేష కృషి చేసిన రిటైర్డ్ డీఈ ప్రతాప్ రెడ్డిని ఈ సందర్బంగా శాలువాతో అభినందించారు. దీంతో దుమ్ముగూడెం, చర్ల సిఐలు సహకారం మరువలేనిది అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి రేసు లక్ష్మి, సిఐ నల్లగట్ల వెంకటేశ్వర్లు, పర్ణశాల, చిన్ననల్లబల్లి, కుర్నపల్లి సర్పంచ్‌లు తెల్లం వరలకీë, మిడియం జయమ్మ, సోడి నాగేశ్వరరావు, విద్యుత్ శాఖ ఎస్.సిఏ. సురేందర్, డిఇ జీవన్ కుమార్, ఏడిఇ శేషాద్రి, ఏఇ రోహిణి, జెఇ మోహన్‌రెడ్డి, తాలిపేరు డిఇలు పవన్, తిరుపతి, జెఇ రాజ్ సుహాస్‌తో పాటు కాంగ్రెస్ మండల అద్యక్షుడు లంకా శ్రీనివాసరావు తదితరులు ఉన్నారు.