Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-అశ్వారావుపేట
సామర్థ్యానికి మించి ఆయిల్ పామ్ గెలలు దిగుబడి కావడంతో పామ్ ఆయిల్ పరిశ్రమల ప్రాంగణంలో గెలలు కుప్పలు పేరుకుపోతున్నాయి. రైతులు సేకరించిన గెలలు లోడు ట్రాక్టర్లు కర్మాగారం ముఖద్వారం నుంచి రాష్ట్రీయ రాహదారికి ఇరువైపుల కిలోమీటర్ మేర బారులు తీరాయి. దీంతో దిగుమతి చేసుకోవడంలో తీవ్రజాప్యం జరుగుతుంది. ఈ క్రమంలో డ్రైవర్లు అవస్థలు పడుతున్నారు. అయినప్పటికీ ప్రాధాన్యత క్రమంలో గెలలు స్వీకరిస్తున్నారు. వర్షాల కారణంతో సోమవారం సాయంత్రానికి సుమారు 9 వేలు టన్నులు గెలలు ఫ్యాక్టరీలకు వచ్చాయి. గానుగ ఆడటంలో జాప్యం కావడంతో గెలలు దిగుమతిలోనూ తాత్సారం జరుగుతుంది.
గెలలు సేకరణకు కోతకూ కోతకూ మధ్య నిడివి కనీసం 15 రోజుల వ్యవధి ఉంటుంది. ప్రతి నెల 1వ తేదీ నుండి గెలలు ధర మారడంతో జూన్ నెల టన్ను గెలలు ధర సుమారు రూ.20 వేలు లోపు, జులై 16వేలకుపైగా ఉండడం మళ్లీ రేటు తగ్గుముఖం పట్టొచ్చు అనే అవగాహనతో రైతులు పచ్చి - ఎచ్చి గెలలు కోసి తీసుకొస్తున్నారు. దీంతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రైతులు సైతం తెలంగాణ ఫ్యాక్టరీలకే గెలలు తీసుకొచ్చారు. ఇదిలా ఉండగా ఇటీవల వర్షాలు సమృద్ధిగా పడటం వాతావరణంలో తేమశాతం అధికమై పచ్చి గెలలు సైతం త్వరగా పక్వానికి రావడంతో రైతులు ఇబ్బడిముబ్బడిగా గెలలు తీసుకొస్తున్నారు.
ఆంధ్రా గెలలు రాకుండా నిఘా : ఆయిల్ ఫెడ్ డి.ఒ బాలక్రిష్ణ.
సామర్థ్యానికి మించి గెలలు రావడంతో తెలంగాణా సరిహద్దు పక్కనే ఉన్న ఆంధ్రా గెలలు వస్తున్నాయని, వాటిని నివారించడానికి అశ్వారావుపేటకు వచ్చే రహదారుల వద్ద ఆయిల్ ఫెడ్ సిబ్బందిచే నిఘా ఏర్పాటు చేసాం.