Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పోతినేని సుదర్శన్ రావు
నవతెలంగాణ-బోనకల్
అవినీతి అక్రమాల నుంచి బయటపడేం దుకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రులు వైయస్ జగన్మోహన్ రెడ్డి, కెసిఆర్ కేంద్ర ప్రభుత్వానికి లొంగిపోయారని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పోతినేని సుదర్శన్ రావు ఘాటుగా విమర్శించారు. మండల పరిధిలోని గోవిందాపురం ఎల్ గ్రామంలో సిపిఎం గ్రామ శాఖల మహాసభలు బుధవారం జరిగింది. మహాసభల ప్రారంభ సూచకంగా సిపిఎం సీనియర్ నాయకురాలు కొమ్ము కమలమ్మ, పార్టీ కార్యాలయం వద్ద సీనియర్ నాయకులు మాదినేని నారాయణ సిపిఎం జెండాలను ఆవిష్కరించారు. అనంతరం కారంగుల చంద్రయ్య అధ్యక్షతన జరిగిన మహాసభలలో పోతినేని సుదర్శన్ రావు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. కరోనా సమయంలో సిపిఎం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో ఐసోలేషన్ కేంద్రంలో 203 మందికి వైద్య సేవలు అందించినట్లు తెలిపారు. ఒక్క పైసా ఖర్చు లేకుండా వారిని ఆరోగ్యవంతంగా చేసి ఇంటికి పంపించిన ఘనత సిపిఎం జిల్లా కమిటీకి దక్కిందన్నారు. ప్రపంచవ్యాప్తంగా కరోనా సష్టించిన కల్లోలం ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా కమ్యూనిస్టు దేశాలు మాత్రమే కరోనా ను అరికట్ట కలిగాయని ప్రపంచ దేశ ప్రజలు అందరు గమనిస్తున్నారని అన్నారు. పెట్టుబడిదారీ రాజ్యాలు కరోనాను అరికట్టలేక పోయాయని అన్నారు. ఈ మహాసభలో సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు పొన్నం వెంకటేశ్వరరావు, జిల్లా కమిటీ సభ్యులు చింతలచెరువు కోటేశ్వరరావు మండల కార్యదర్శి దొండపాటి నాగేశ్వరరావు, మండల కమిటీ సభ్యులు గూగులోతు నరేష్, లక్ష్మీపురం ఎంపిటిసి జొన్నలగడ్డ సునీత, సీపీఐ(ఎం) గ్రామ కమిటీ కార్యదర్శి ఉమ్మనేని రవి, శాఖా కార్యదర్శులు ఏడునూతల లక్ష్మణరావు, కోట కాటయ్య సొసైటీ అధ్యక్షుడు మాదినేని వీరభద్రరావు తదితరులు పాల్గొన్నారు.