Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- భృతిని అమలు చేయాలి
- 23న వామపక్ష యువజన, విద్యార్థి
- సంఘాలు ఛలో కలెక్టరేట్ ముట్టడి
నవతెలంగాణ-ఖమ్మం
నిరుద్యోగుల సమస్యలను పరిష్కరించాలి, నిరుద్యోగ భృతిని అమలు చేయాలని డీవైయఫ్ఐ జిల్లా సహాయ కార్యదర్శి చింతల రమేష్, పీవైయల్ జిల్లా కార్యదర్శి కె. శ్రీనివాస్, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి జెమ్మి. అశోక్, పిడియస్యు జిల్లా అధ్యక్షుడు నామాల.ఆజాద్ డిమాండ్ చేశారు. మంగళవారం స్థానిక సుందరయ్య భవన్లో వామపక్ష యువజన, విద్యార్థి సంఘాల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిరుద్యోగులకు ఉద్యోగాల నోటిఫికేషన్ వెంటనే ప్రకటించి, జాబ్ క్యాలెండర్ని విడుదల చేయాలని, నిరుద్యోగ భృతిని ప్రకటించాలని, ఆత్మహత్య చేసుకున్న నిరుద్యోగి సానిక. నాగేశ్వరరావు కుటుంబానికి యాభై లక్షల ఎక్సగ్రెసియా,ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని, ఉద్యోగాలు ఇప్పిస్తామని లక్షల రూపాయలు వసూళ్లు చేస్తూ నిరుద్యోగులను మోసం చేస్తూన్న వారిపై క్రిమినల్ కేసులు పెట్టి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 23 వ తేదీన వామపక్ష యువజన, విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఖమ్మం జిల్లా కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమం నిర్వహిస్తున్నామని జయప్రదం చేయాలని పిలుపు నిచ్చారు. ఈ సమావేశంలో డి.వై.యఫ్.ఐ జిల్లా నాయకులు రావులపాటి. నాగరాజు, ఎస్ఎఫ్ఐ జిల్లా నాయకులు రాజేష్, కిట్టు, పివైయల్ జిల్లా నాయకులు రాకేష్, చందు పాల్గొన్నారు.