Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నేడు 35వ వర్ధంతి
నవతెలంగాణ-ముదిగొండ
అణగారిన బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం కమ్యూనిస్ట్ నీడలో మార్కిస్టు పార్టీ జెండా పట్టుకొని తన చిన్నవయసులోనే పేదల బతుకులు తెలుసుకున్నారు. వారి జీవితాలు బాగుపడాలని లక్ష్యంతో భూస్వామ్య పెత్తందార్ల వ్యతిరేక విధానాలను నిరసిస్తూ నిప్పుల రగిలి రణధీరుడుగా గ్రామంలోనే జీవితాన్ని త్యాగం చేసి గ్రామప్రజల ప్రయోజనాలు కోరుకొని గ్రామాన్ని అభివృద్ధి బాటలో నడిపిన నాయకుడు. రైతుకూలీ, వ్యవసాయ కార్మికులను ఐక్యం చేసి వారికి అండగా ఉండి ఉద్యమాలు నిర్వహించి శ్రమకు తగ్గ వేతనాలను సాధించి పెట్టి పేదలకు ఇళ్ల ప్లాట్లను పంచిపెట్టి విజయ కేతనాన్ని ఎగరవేసి గ్రామాన్ని అభివృద్ధి చేసిన సీపీఐ(ఎం) మహానాయకులు, యువనాయకుడు నిస్వార్ధ త్యాగశీలి ధన్యజీవి ప్రజానాయకుడు అమ్మపేట అభివృద్ధి ప్రదాత అమరవీరుడు కామ్రేడ్ కోయ బాబు.
ఆయన నాయకత్వాన సిపిఎం పార్టీ అభివద్ధిని మంచితనాన్ని చూసి ఓర్వలేక సీపీఐ ముసుగులో గుండాలు కత్తులతో దాడి చేసి అన్యాయంగా జూలై, 21, 1986లో హతమార్చి నేటికి 35 సంవత్సరాలు అవుతోంది. నేడ 35వ వర్ధంతి సందర్భంగా నవతెలంగాణ ప్రత్యేక కథనం.
మండల పరిధిలో అమ్మపేట గ్రామంలో 1953లో ఉన్నతమైన కుటుంబం కోయ వెంకటేశ్వరరావు (బాబు) జన్మించాడు. తాను చిన్న వయసులోనే సీపీఐ(ఎం) సిద్ధాంతాలను చూసి ఆకర్షితులై ఎర్రజెండాను పట్టుకుని ప్రజల బతుకుల్లో పొద్దు పొడవాలని పోరుబాట పట్టాడు. అమ్మపేటతోపాటు చుట్టుపక్కల గ్రామాలలో ఆనాడు పార్టీ కార్యకర్తగా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటూ అనతికాలంలోనే నాయకుడుగా మంచి గుర్తింపు పొందాడు. గ్రామ ప్రజలకు ఇళ్ల ప్లాట్లు ఇప్పించాలని ప్రభుత్వంతో పోరాడి 14 ఎకరాలను సాధించి పంపిణీ చేసిన ఇండ్లు నిర్మాణానికి కృషి చేశారు. గ్రామంలో కమ్యూనిస్టు పార్టీకి తిరుగులేదని అమ్మపేట అంటే సీపీఐ(ఎం) అడ్డా అనే రీతిలో పార్టీ అభివృద్ధి చేశారు. పార్టీ అభివృద్ధిని చూసి ఓర్వలేని గ్రామంలోని కాంగ్రెస్ పార్టీ పెత్తందారులు సీపీఐ గుండాలు నిర్బందాలు, దాడులు చేపట్టి ప్రజలను భయభ్రాంతులకు గురి చేసిన మొక్కవోని దీక్షతో కోయ బాబు నమ్మిన సిద్ధాంతం కోసం ఆఖరి శ్వాస వరకు బడుగు బలహీనవర్గాల పేదల కోసం పోరాడి చరిత్రలో రణధీరుడుగా నిలిచారు. గ్రామంలోనే ఆయన సహచరులు ఊటుకూరి గోపయ్య, ఊటుకూరి పెద్ద కోటయ్య, దండా వెంకటేశ్వర్లు, కోయ వెంకటేశ్వరరావు, ఎస్.కె మదర్, సాహెబ్ బెజవాడ వెంకటేశ్వరరావు కోయ బాబుకు ముఖ్యఅనుచరులుగా ఉండేవారు. పార్టీ నాయకులు రావెళ్ళ సత్యం, వనం నర్సింగరావు, గండ్లూరి కిషన్ రావు, గండ్ర వీరభద్రారెడ్డి స్ఫూర్తితో కోయ బాబు ఈప్రాంతంలో పార్టీని నిస్వార్ధంగా పురోభివృద్ధిలో నడిపించారు. ప్రజలకు వెలుగు వెట్టి చాకిరి విముక్తి కోసం బాంచన్ కాల్మొక్తనే దొరతనాన్ని ఎదిరించిన సత్యసింధూరం కోయ బాబు 20 సంవత్సరాలుగా ప్రజా సమస్యల పట్ల సాయుధుడై తిరుగుబాటు చేసి సమర శంఖం పూరించారు. కోయ బాబు ఆయనకు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. కోయ బాబు ఉంటే ఆటలు సాగవు అంటూ కాంగ్రెస్ పార్టీ అండతో గ్రామ సిపిఐ గుండాలు గ్రామంలోని మాటుగాసి వేటువేసి కత్తులతో దాడి చేసి జూలై 21, 1986లో అత్యంత పాశవికంగా హత్యచేశారు. నేటికి గ్రామంతో పాటు చుట్టుపక్కల గ్రామాలలో ప్రజల గుండెల్లో సజీవంగా ఉన్నారు. గ్రామం నడిబొడ్డున స్తూపమై వెలుగుతున్నారు. ఉద్యమతార అరుణతార కోయ బాబుకు కొనెత్తుటి జోహార్లు.