Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంత్రి అజరుతో మర్యాదపూర్వక భేటీ
- అధికారులు, అనధికారుల శుభాకాంక్షలు
- హుజురాబాద్ ఉప ఎన్నిక నేపథ్యంలోనే బదిలీలు?
నవతెలంగాణ- ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి:
ఖమ్మం జిల్లా 49వ కలెక్టర్‌గా వీపీ గౌతమ్ మంగళవారం ఉదయం 10.45 గంటలకు బాధ్యతలు స్వీకరించారు. మహబూబాబాద్ జిల్లా కలెక్టర్‌గా పనిచేస్తున్న ఆయన సోమవారం రాత్రి జరిగిన బదిలీల్లో ఖమ్మం జిల్లా కలెక్టర్‌గా నియమితులయ్యారు. 2018 ఆగష్టు 30వ తేదీ నుంచి సోమవారం వరకు జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు నిర్వహించిన ఆర్వీ కర్ణన్ కరీంనగర్ కలెక్టర్‌గా బదిలీ అయ్యారు. ఆయన కూడా మంగళవారం అక్కడ బాధ్యతలు స్వీకరించారు. ఇక కొత్త కలెక్టర్ గౌతమ్‌కు ఉమ్మడి జిల్లాతో పరిచయం ఉంది. 2014 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన ఆయన 2019 ఫిబ్రవరి 27 నుంచి 2020 ఫిబ్రవరి 3 వరకు భద్రాచలం ఐటీడీఏ పీవోగా విధులు నిర్వహించారు. తమిళనాడులోని దిండిగల్ మండలం ఒడెన్ఛత్రంకు చెందిన గౌతమ్ తల్లిదండ్రులు కస్తూరి ప్రభుత్వ ఉపాధ్యాయురాలు, తండ్రి వి.వలనిచామై పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా విధులు నిర్వహించారు. 23 ఏళ్ల వయసులోనే 2013లో తొలి ప్రయత్నంలోనే 138వ ర్యాంక్‌తో సివిల్స్‌కు ఎంపికయ్యారు. ములుగు సబ్‌కలెక్టర్‌గా, గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ కమిషనర్‌గా పనిచేశారు. ఆ తర్వాత భద్రాచలం ఐటీడీఏ పీవోగా పనిచేసి, మహబూబాబాద్ జిల్లా కలెక్టర్‌గా బదిలీపై వెళ్లారు. ఆ జిల్లాలో భూ ఆక్రమణలు, రియల్ దందాలను నిలువరించడంలో ముక్కుసూటిగా వ్యవహరించారనే పేరు గౌతమ్‌కు ఉంది. వివిధ ప్రభుత్వ శాఖలను సమన్వయం చేయడంతో పాటు విధి నిర్వహణలో అలసత్వం వహించే అధికారులు, ఉద్యోగులపై చర్యలు తీసుకోవడంలో వెనుకాడరని అంటున్నారు. బాధితులు నేరుగా ఇచ్చే ఫిర్యాదులకే ప్రాధాన్యం ఇస్తారని చెబుతున్నారు.
- మంత్రితో మర్యాదపూర్వక భేటీ
జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం వీపీ గౌతమ్ రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజరుకుమార్‌ను ఆర్అండ్బీ అతిథిగృహంలో మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. నూతన కలెక్టర్‌కు మంత్రి అభినందనలు తెలిపారు. ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, సత్తుపల్లి, వైరా ఎమ్మెల్యేలు సండ్ర వెంకటవీరయ్య, లావుడ్యా రాములునాయక్, జడ్పీ చైర్మన్ లింగాల కమలరాజ్, మేయర్ పునుకొల్లు నీరజ, సుడా చైర్మన్ బచ్చు విజరుకుమార్, డిప్యూటీ మేయర్ ఫాతిమా జోహారా తదితరులు కలెక్టర్‌కు శుభాకాంక్షలు తెలిపారు.
- హుజురాబాద్ ఉప ఎన్నిక నేపథ్యంలోనే బదిలీలు?
ఎన్నికల నిర్వహణలో క్రితం కలెక్టర్ కర్ణన్‌కు మంచి పేరుంది. హుజురాబాద్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే ప్రభుత్వం ఆయన్ను కరీంనగర్ బదిలీ చేసినట్లు భావిస్తున్నారు. కర్ణన్ ఖమ్మం జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన మూడు నెలలకే జరిగిన అసెంబ్లీ ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించారు. పోలింగ్ శాతం పెంపునకు కృషి చేశారు. 2019 జనవరిలో జరిగిన పంచాయతీ ఎన్నికలు, ఏప్రిల్ 11న పార్లమెంట్ ఎన్నికలు, ఎంపీటీసీ, జడ్పీటీసీ, ఇటీవల ఖమ్మం కార్పొరేషన్... ఇలా అన్ని ఎలక్షన్లను కర్ణన్ విజయవంతంగా నిర్వహించారు. స్థానిక సంస్థల ఎన్నికలు సమర్థవంతంగా నిర్వహించినందుకు గాను తెలంగాణ స్టేట్ డెమొక్రసీ అవార్డును 2020 జనవరి 11న గవర్నర్ తమిళసై నుంచి స్వీకరించారు. ఎన్నికలను విజయవంతంగా నిర్వహించడంలో కృతకృత్యులవుతున్న కర్ణన్‌ను హుజురాబాద్ అసెంబ్లీ ఉప ఎన్నిక నేపథ్యంలోనే కరీంనగర్ జిల్లా కలెక్టర్‌గా బదిలీ చేశారని పలువురు అంటున్నారు.
- నూతన కలెక్టర్‌కు పలువురి శుభాకాంక్షలు
ఖమ్మం జిల్లా నూతన కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన వీపీ గౌతమ్‌కు అధికారులు, అనధికారులు శుభాకాంక్షలు తెలిపారు. నగరపాలక సంస్థ కమిషనర్ అనురాగ్‌జయంతి, అదనపు కలెక్టర్లు స్నేహలత మొగిలి, ఎన్. మధుసూదన్, ట్రైనీ కలెక్టర్ రాహుల్, కలెక్టరేట్ పరిపాలనాధికారి మదన్‌గోపాల్, జిల్లా వ్యవసాయశాఖ అధికారి విజయనిర్మల, ఏడీఏలు, డీఎంహెచ్ఓ మాలతి, జిల్లా ఆస్పత్రి సూపరింటెండెంట్ బి.వెంకటేశ్వర్లు, నీటిపారుదల శాఖ ఎస్ఈ శంకర్‌నాయక్, డీఎస్వో రాజేందర్, కలెక్టరేట్ ఉద్యోగులు, ఆర్డబ్ల్యూఎస్, జిల్లా పరిషత్, పంచాయతీ రాజ్ అధికారులు, ఉద్యోగులు తదితరులు కలెక్టర్‌కు శుభాకాంక్షలు తెలిపారు.