Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఏజే రమేష్
నవతెలంగాణ-కొత్తగూడెం
వైద్య ఆరోగ్య శాఖలోని నేషనల్ హెల్త్ మిషన్ (ఎన్హెచ్ఎం) కాంట్రాక్ట్ ఉద్యోగులకు పీఆర్సీ ప్రకారం వేతనాలు పెంచి, రెగ్యులర్ చేయ్యాలని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఏజే రమేష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం కలెక్టర్‌కు వినతి పత్రం అందజేశారు. ఈ సంధర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ తొలి పీఆర్సీలో జీఓ 60 ద్వారా కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు వేతనాలు పెంచింది. కానీ వైద్య ఆరోగ్య శాఖలోని నేషనల్ హెల్త్ మిషన్ (ఎన్హెచ్ఎం) పరిధిలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగులకు వేతనాలు పెంచలేదని తెలిపారు. గత 15 నుండి 22 సంవత్సరాలుగా పనిచేస్తూ, ఛాలీచాలని జీతాలతో ఉద్యోగ భద్రత లేక చాలా ఇబ్బందులు పడుతున్నారని తెపారు. గత 17 నెలలుగా కరోనా మహమ్మారితో సహవాసం చేస్తూ తమ ప్రాణాలను సైతం ఫణంగా పెట్టి అంకితభావంతో విధులు నిర్వహిస్తున్నారన్నారు. ఈ సందర్భంలో ప్రభుత్వం సానుకూలంగా ఆలోచించి వేతనాలు పెంచి, రెగ్యులర్ చెయ్యాలని డిమాండ్ చేశారు. నేషనల్ హెల్త్ మిషన్‌లోని రెండవ ఏఎన్ఎంలు, అర్బన్ ప్రైమరీహెల్త్ సెంటర్స్‌లోని ఏఎన్ఎంలు, కమ్యూనిటీ ఆర్గనైజర్లు, స్టాఫ్ నర్స్‌లు, మెడికల్ ఆఫీసర్ అసిస్టెంట్స్, ల్యాబ్ టెక్నీషియన్స్, ఫార్మాసిస్టు, అకౌంటెంట్లు, డేటా ఎంట్రీ ఆపరేటర్స్, స్వీపర్స్, వాచ్ మెన్స్ ఇతర సిబ్బంది, వైద్య విధాన పరిషత్, డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ విభాగాలలోని ఉద్యోగులు, ఆయుష్, యటీ ఈపి, టీసాక్స్, ఆర్ఎస్కె, యన్సీడి, ఆరోగ్యశ్రీ, బ్లడ్‌బ్యాంక్స్, సిమాంక్, ఎస్ఆర్సి ఎస్ఎస్సీయు, డైక్ ఇతర అన్ని స్కీంల లోని ఉద్యోగులు, డిఇఓలు, ప్రోగ్రాం అధికారులు, హెల్తడ్ ఏఎన్ఎంలు, డ్రైవర్లు, కంటింజెన్సీ ఉద్యోగులు, నేచురోపతి, ఐపియంలోని ఉద్యోగులు ఇతర విభాగాలలోని ఉద్యోగులు అందరూ మెరిట్ ప్రాతిపదికన రూల్ ఆఫ్ రిజిస్ట్రేషన్, రోష్టర్ ప్రాతిపదికన నియామకమై గత 22 సంవత్సరాలుగా పనిచేస్తూ ఏజ్ లిమిట్ దాటిపోయి ఉన్నారని ఆవేదన వ్యక్తంచేశారు. కావున వీరందరినీ యదావిధిగా రెగ్యులర్ చెయ్యాలని డిమాండ్ చేశారు. నేషనల్ హెల్త్ మిషన్‌లో 510 జీఓ ద్వారా వేతనాలు పెరగని కమ్యూనిటీ ఆర్గనైజర్స్, అకౌంటెంట్స్, మెడికల్ ఆఫీసర్ అసిస్టెంట్స్, స్వీపర్స్, వాచ్ మెన్స్ ఇతరులకు వేతనాలలో ఉన్న వ్యత్యాసాన్ని సవరించి పీఆర్సీ వర్తింపజేయాలన్నారు. భారత అత్యున్నత న్యాయ స్థానం 2016 అక్టోబర్ 31న శాశ్వత స్వభావం కల్గిన పోస్టు లలో శాశ్వత సిబ్బందిని నియమించాలని సమాన విద్యార్హత తో పనిచేస్తున్న సిబ్బందికి సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని తీర్పు ఇచ్చిందని గుర్తుచేశారు. కరోనా కాలంలో పనిచేసి తొలగించబడిన 1.640 మంది స్టాఫ్ నర్లను యదా విధిగా తిరిగి విధుల్లోకి తీసుకోవాలని, వేతనం తో కూడిన 180 రోజుల ప్రసూతి సెలవులు ఇవ్వాలన్నారు. విధి నిర్వహ ణలో చనిపోతే రూ.25 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీఐటీ యూ జిల్లా అధ్యక్షులు యంవి అప్పారావు, మెడికల్ హెల్త్ రాష్ట్ర నాయకులు కొండల్, సాగర్, కార్మికులు ఎస్.వెం కటేశ్వర్లు, టి.సత్యనారాయాణ, వి.శ్రీనివాస్, సుజాత, నాగమణి, శోబా రాణి, భూలక్ష్మి, దుర్గా, దుర్గమ్మ, ఎన్ స్వాతి పాల్గొన్నారు.