Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డీవైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి బాలరాజు
నవతెలంగాణ-సుజాతనగర్
అందరకీ విద్య, ఉపాధి అవకాశాల కోసం నేటి యువత ఉద్యమించాలని డీవైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి లిక్కీ బాలరాజు పిలుపునిచ్చారు. మంగళవారం భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య డీవైఎఫ్ఐ మండల రెండవ మహాసభలు ఉప్పెర్ల ప్రశాంత్ అధ్యక్షతన నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వాతంత్రోద్యమ స్ఫూర్తిని నాటి పోరాట వారసత్వాన్ని డీవైఎఫ్ఐ కొనసాగి స్తుందన్నారు. కరోనా మహమ్మారి విజృంభించిన నేపథ్యంలో కష్టకాలంలో ప్రజలకు అండగా ఉంటూ సేవా కార్యక్రమాలు, హెల్ప్ లైన్ సెంటర్లు ఏర్పాటు చేసి కరోనా బాధితులకు నిత్యావసరాల పంపిణీ మొదలుకొని డీవైఎఫ్ చేసిందన్నారు. కరోనా మృతులకు దహన సంస్కారాలు నిర్వహించి మానవత్వాన్ని చాటుకుందన్నారు. అనంతరం నూతన కమిటీని ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో ఏర్పుల వీరబాబు, అశోక్, శ్రీను, శ్రీకాంత్, యాకయ్య, సురేష్, రఘు, నాగరాజు, రాజేష్, లక్ష్మీనారాయణ, రమేష్ తదతరులు పాల్గొన్నారు.