Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- చిన్నతనంలోనే సినిమా చాన్స్
- ప్రతిభతో అబ్బురపరుస్తున్న కార్తీక
నవతెలంగాణ-కారేపల్లి
గిరిజన తండాలో పుట్టి చదువులతో పాటు కళలలోను మేటి అనిపించుకుంటుంది కార్తీక, కారేపల్లి మండలం భాగ్యనగర్తండాకు చెందిన మాలోత్ హరిరాం, స్వరూప దంపతులకు ముగ్గురు ఆడ పిల్లలు. తల్లిదండ్రుల ప్రోత్సహంతో చదువులలో రానిస్తూ అందరి ప్రశంసలు పొందుతున్నారు. చిన్న కూతురు మాలోత్ కార్తీక చిన్నతనం నుండే సంగీతంపై మక్కువతో సినిమా చాన్స్ దక్కించుకుంది. కార్తీక ప్రతిభను గుర్తించిన తల్లిదండ్రులు ప్రోత్సహించారు. పాఠశాలలో గురువుల సహాయంతో మేళకువలు నేర్చుకుంది. గిరిజన ప్రాధమిక పాఠశాలలో 5వ తరగతి వరకు నభ్యసించిన కార్తీక పాల్వంచ ఏకలవ్య రెసిడెన్సియల్ పాఠశాలలో సీటు సంపాంధించింది. 9వ తరగతి చదువుతున్న కార్తీక జానపద, సినిమా పాటలను పాడి గురువులను అబ్బురపర్చింది. కార్తీక ప్రతిభ గుర్తించిన సినిమా డైరక్టర్ సఫారి సినిమాలో అవకాశం కల్పించాడు. ఆ సినిమాలో పాటలు పాడి అందరి చేత శభాష్ అనిపించుకుంది. బాలిక ప్రతిభను మెచ్చుకున్న ఏకలవ్య గురుకుల అధికారులు ప్రత్యేకంగా కార్తీకను హైదరాబాద్ రప్పించి సన్మానం చేశారు. గిరిజన తండాకు చెందిన బాలిక చిన్నతనంలోనే తన ప్రతిభతో గ్రామానికి గుర్తింపు తేవటంపై గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.