Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
ముస్లిం సోదరీ సోదరులకు రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజరు కుమార్ బక్రీదు శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో ముస్లింల కోసం ప్రత్యేక సంక్షేమ పథకాలు చేపడుతున్నామన్నారు. లౌకిక స్ఫూర్తిని చాటుతూ దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నామని తెలిపారు. త్యాగానికి ప్రతీకగా బక్రీద్ జరుపుకుంటారని, తెలంగాణ రాష్ట్రం కూడా త్యాగాల ఫలితంగా ఏర్పడిందని మంత్రి పేర్కొన్నారు. సాధించుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా అభివద్ధి చేసేందుకు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు అనేక సంక్షేమ, అభివద్ధి కార్యక్రమాలు అమలు చేస్తున్నారన్నారు. ముఖ్యంగా మైనారిటీలకు తెలంగాణ ప్రభుత్వం షాదీముబారక్, ప్రత్యేక గురుకులాలు, ఓవర్సీస్ స్కాలర్ షిప్ స్కీం, ఉర్దూ భాషను మొదటి లాంగ్వేజ్ ఆప్షన్ భాషగా గుర్తింపు, ఉర్దూలో డిఎస్సి వంటి అనేక కార్యక్రమాలు చేపడుతోం దన్నారు. షాదీ ముబారక్ ద్వారా నేటి వరకు దాదాపు 1,87,976 మంది కుటుంబాలకు 14,054 కోట్ల రూపాయలు లబ్ది చేకూర్చామన్నారు. విదేశాలలో విద్య కోసం ఓవర్సిస్ పథకం ద్వారా ఒక్కొక్కరికి 20 లక్షల రూపాయల చొప్పున 294 కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపారు. ప్రభుత్వం చేపడుతున్న ఈ పథకాలను సద్విని యోగం చేసుకొని ముస్లిం ప్రజలంతా సంతోషంగా ఉండాలని ఆకాంక్షించారు. బక్రీద్ పండుగను ఆనందోత్సాహాల మధ్య కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఇంట్లోనే తమ కుటుంబ సభ్యుల మధ్య జరుపుకోవాలని కోరారు. బంగారు తెలంగాణలో అందరూ భాగస్వాములై, లౌకికస్పూర్తిని ప్రదర్శిస్తూ, మత సామరస్యాన్ని పాటిస్తూ రాష్ట్ర ప్రతిష్టను పెంచాలని మంత్రి విజ్ఞప్తి చేశారు.