Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) నేత నున్నా నాగేశ్వరరావు
- పోడు సమస్య పరిష్కారానికి హామీతో ఆందోళన విరమణ
నవతెలంగాణ-కారేపల్లి
పోరాడితేనే పోడు సమస్య పరిష్కారం అవుతుందని సిపిఎం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు అన్నారు. ఫారెస్ట్ వేధింపులపై గిరిజనులు మంగళవారం ఫారెస్ట్ కార్యాలయం ముందు చేస్తున్న ఆందోళన రాత్రి వరకు కొనసాగింది. ఈ ఆందోళన వద్దకు వచ్చిన నున్నా నాగేశ్వరావు ఫారెస్ట్ రేంజ్ అధికారి తో చర్చించారు. హక్కు పత్రాలు ఉన్న గిరిజనులను వేధించటం సరికాదన్నారు. పంటలు రక్షించుకోవడానికి బోర్లు, విద్యుత్తు అవసరం గుర్తించాలని కోరారు. యాంత్రిక వ్యవసాయం చేయకుంటే రైతు పరిస్థితి అప్పుల ఊబిలో కూరుకుపోవడం తప్ప ఏమీ మిగలదు అని అన్నారు. పోడు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలన్నారు. దీనిపై స్పందించిన ఫారెస్ట్ రేంజ్ అధికారి పోడు సమస్యకు ఉన్నతాధికారులతో మాట్లాడి తక్షణ పరిష్కారం చూపుతామని హామీ ఇచ్చారు. పోడు రైతులతో చర్చించి ఆమోదయోగ్యమైన పరిష్కారం కనుగొందమని పేర్కొన్నారు. ట్రాక్టర్లతో సాగుకు, విద్యుత్ కనెక్షన్ ఏర్పాటుకు అంగీకారం తెలిపినట్టు నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఎం కార్యదర్శివర్గ సభ్యులు భూక్యా వీరభద్రం, జిల్లా కమిటీ సభ్యులు మెరుగు సత్యనారాయణ, కె.నాగేశ్వరరావు, మండల కార్యదర్శి కే.నరేంద్ర నాయకులు ధరావత్ సైదులు, మాలోత్ రాంకోటి, ముండ్ల ఏకాంబరం, అన్నవరవు కృష్ణ పాల్గొన్నారు.
ముస్లీం సోదరులకు బక్రీద్ శుభాకాంక్షలు : ఎంపీ నామ
ఖమ్మం: బక్రీద్ పర్వదినాన్ని పురస్కరించుకొని ముస్లీం సోదరులకు టీఆర్ఎస్ లోక్‌సభ పక్ష నేత, ఖమ్మం ఎంపీ నామ నాగేశ్వరరావు శుభాకాంక్షలు తెలిపారు. భక్తిభావం, త్యాగానికి, సహనానికి ప్రతీక బక్రీద్ అని తెలిపారు. త్యాగాన్ని స్మరించుకుంటూ జరుపుకునే బక్రీద్ పేదల పట్ల దయ, కరుణ, సేవా గుణాన్ని నింపాలని కోరారు. బక్రీద్ సందేశాన్ని స్ఫూర్తిగా తీసుకొని సమాజంలో శాంతి, సేవాభావం నెలకొల్పడానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని కోరారు. బక్రీద్‌ను ముస్లీం సోదరులు భక్తి, శ్రద్ధలతో జరుపుకోవాలని ప్రకటనలో పేర్కొన్నారు.