Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు
- కలెక్టర్ అనుదీప్
నవతెలంగాణ-కొత్తగూడెం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని మున్సిపల్, పంచాయతీ పరిధిలో ఏర్పాటు చేస్తున్న అక్రమ లే ఔట్లపై నిరంతర పర్యవేక్షణ ఉండే విధంగా చర్యలు తీసుకుంటామని కలెక్టర్ దురిశెట్టి అనుదీప్ తెలిపారు. మంగళవారం హైద్రాబాద్ నుండి పురపాలక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అరవింద్ కుమార్ మున్సిపల్ కమిషనర్లు, అదనపు కలెక్టర్లు, జిల్లా కలెక్టర్లుతో అక్రమ లే అవుట్లు ఆడిట్, మున్సిపల్ ఆస్తుల పరిరక్షణ, హరితహారం కార్యక్రమాలపై నిర్వహించిన వీడియో కాన్ఫెరెన్స్‌లో జిల్లా కలెక్టర్ అనుదీప్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ ప్రిన్సిపల్ సెక్రటరీ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ వివరాలను ఆయన ప్రకటించారు. జిల్లాలో ఉన్న అన్ని లే అవుట్ వివరాలు సేకరణ చేయాలని మున్సిపల్, పంచాయతీ అధికారులను ఆదేశించారు. లే అవుట్ ఓపెన్ స్థలాలను మున్సిపాల్టీ పేరిట రిజిస్టర్ చేయాలని చెప్పారు. ప్రతి లే అవుట్ ఓపెన్ స్థలాలలో పెద్ద ఎత్తున మొక్కలు నాటాలన్నారు. పట్టణాల్లో పెద్ద ఎత్తున అవెన్యూ ప్లాంటేషన్ చేపట్టాలన్నారు. అవినితీకి పాల్పడే అధికారుల పై క్రిమినల్ కేసుల నమోదు చూస్తామని హెచ్చరించారు.
టీ- బీపాస్ ద్వారా అనుమతించిన భవనాలను మున్సిపల్, పంచాయతి అధికారులు క్షేత్రస్థాయిలో తనిఖీ చేయాలన్నారు. నిబంధనల మేరకు లే అవుట్లలో 10 శాతం ఓపెన్ స్థలం స్థానిక సంస్థల పేరు మీద రిజిస్టర్ చేయకపోతే సదరు లే అవుట్ డవలపర్ నుండి జరిమానా వసూళ్లు చేయాలని ఆదేశించారు. నూతన మున్సిపల్ చట్టం ప్రకారం లే అవుట్లకు అనుమతి తప్పనిసరి అని, అయినప్పటికి కొన్ని అనుమతి లేని లే అవుట్లు వస్తున్నాయని తెలిపారు.