Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- చైర్మన్ రామక్రిష్ణారెడ్డి
నవతెలంగాణ-అశ్వారావుపేట
ఆయిల్ ఫెడ్ పరిశ్రమల సామర్థ్యం మించి గత వారం రోజులుగా పామ్ ఆయిల్ గెలలు దిగుబడి కావడం అవి కర్మాగారలకు చేరడం, వాటిని సకాలంలో దిగుమతి చేసుకోలేక పోవడం, అదే క్రమంలో గానుగ ఆడక పోవడం అనే అంశాలు నవతెలంగాణలో మంగళవారం భారీగా గెలలు శీర్శికతో వార్త ప్రచురితం అయింది.
దీంతో కారణాకారణలను అన్వేషించి, అవగాహన కొచ్చిన సంస్థ చర్యలు దిశగా కదులుతుంది. ఈ క్రమంలో ఆయిల్పేడ్ చైర్మన్ కంచర్ల రామక్రిష్ణారెడ్డి రైతులకు విజ్ఞప్తి అంటూ అధికారికంగా మంగళవారం ఒక ప్రకటన విడుదల చేసారు.
తెలంగాణ పామ్ ఆయిల్ రైతులకు విజ్ఞప్తి
గత నాలుగు రోజులుగా ఆయిల్ పామ్ గెలలు రెండు ఫ్యాక్టరీల సామర్థ్యానికి మించి వస్తున్నాయి. అందు వలన గెలలు దిగుమతిలో ఆలస్యం జరుగుతోంది. అంతే గాకుండా ఆంధ్రా ప్రాంతంలో సాగు అయ్యే గెలలు అశ్వారావుపేటకు రాకుండా నిరోధించడానికి సరిహద్దుల్లో (చెక్ పోస్టు) తనిఖీ కేంద్రాలు ఏర్పాటు చేసాము. ఆంధ్ర గెలలు తెలంగాణలో దిగుమతి చేసుకోవడం జరగదు. ఎవరైతే చెక్ పోస్టులో ఆగకుండా, అడ్డదారిలో వచ్చిన వాహనాన్ని సైతం కర్మాగారంలోకి అనుమతించేది లేదు. అయితే కొంతమంది మన తెలంగాణ రైతులు తమకు కేటాయించిన ఫ్రూట్ కోడ్ (ఎఫ్ కోడ్)ను ఆంధ్రా రైతులకు ఇచ్చి వాళ్లకు సహకరించే ధోరణిలో ఉన్నారు. దయచేసి అటువంటి రైతులు ఆంధ్రా రైతులకు ఫ్రూట్ కోడ్ ఇవ్వా కూడదని కోరుతున్నాను. తెలంగాణ రైతుల గెలలు రద్దీ దృష్ట్యా ఆలస్యం అవ్వొచ్చు కానీ ప్రతి వాహనం దిగుమతి చేసుకుంటాము. తెలంగాణ రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.