Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- ఖమ్మం
చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా కరోనా బాధితులకు ఊపిరి నిలుపుతుందని ఖమ్మం చిరంజీవి ఆక్సిజన్ బ్యాంక్ బాధ్యులు గుండాల వీరేశ్ గౌడ్, యండి సాదిక్ అలీ, గంగిశెట్టి శ్రీనివాస్ , కొమ్ము విజేతలు తెలిపారు. ఖమ్మం గట్టయ్య సెంటర్ ప్రాంతానికి చెందిన మడుపు విజిత కు కరోనా సోకడం వలన ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందగా, డాక్టర్లు ఆక్సిజన్ తక్కువగా ఉందని ఇంటి వద్ద ఆక్సిజన్ పెట్టుకోమని సూచించగా ఆమె భర్త నాగేశ్వరరావు ఖమ్మం చిరంజీవి ఆక్సిజన్ వారిని సంప్రదించగా వారికి ఉచిత ఆక్సిజన్ సిలిండర్ అందజేసినట్లు తెలిపారు. అదే విధంగా ఎవరికైనను ఆక్సిజన్ అవసరమైతే ఖమ్మం బుర్హన్ పురంలోని ఆంజనేయ స్వామి గుడి పక్కన తమ కార్యాలయంలో సంప్రచించాలని పేర్కొన్నారు.