Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కొణిజర్ల
మండల పరిధిలోని సింగరాయపాలెం గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలకు సైన్స్ లాబ్ మంజూరి అయినట్లు జడ్పీటీసీ పోట్ల కవిత తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లా పరిషత్ 15 ఫైనాన్స్ 2020, 2021 నిధుల నుండి వైరా ఎమ్మెల్యే లావుడియా రాములునాయక్, జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు సహకారంతో సైన్స్ ల్యాబ్ ను మంజూరు చేయడం జరిగిందిన్నారు. జిల్లాలో అత్యధిక శాతం విద్యార్థులు ఉన్న పాఠశాల సింగరాయపాలెం అని అటువంటి పాఠశాలకు సైన్స్ ల్యాబ్ తీసుకురావడం విద్యార్థుల అదృష్టమన్నారు. ఈ సైన్స్ ల్యాబ్‌ను విద్యార్థులు సక్రమంగా వినియోగించుకోవాలన్నారు. సైన్స్ ల్యాబ్ మంజూరు అవడంతో ఎమ్ఈవో యం శ్యాంసన్, ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేశారు.