Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కారేపల్లి
కారేపల్లి మండలం ఎర్రబోడులో బుధవారం సీజనల్ వ్యాధులు, పల్లె ప్రకతి వనం, ప్రభుత్వ పథకాలపై కళాబందం చైతన్య కార్యక్రమం నిర్వహించింది. కళాకారులు పాటలు, పల్లె సుద్దులు, బుర్ర కథల ద్వారా పారిశుద్ధ్యం ప్రాముఖ్యత గురించి వివరించారు. పట్టణ పోకడలు పోతున్న పల్లెల్లో పల్లె ప్రకతి వనాల ఆవశ్యకతను ప్రజలకు తెలియజేస్తూ ప్రతి ఇంటిలో మొక్కలు నాటాలని కోరారు. ఈ సందర్భంగా సర్పంచ్ కుర్సం సత్యనారాయణ మాట్లాడుతూ సీజనల్ వ్యాధులుప్రబలడానికి పారిశుద్ధ్య లోపం కారణమన్నారు. కార్యక్రమంలో కళా బృందం సభ్యులు బొమ్మర ముత్యం, రమేష్, కృపానందం, భద్రయ్య, గోవిందు, రవి నాయక్, అంగన్వాడీ టీచర్లు కష్ణకుమారి, ఉమాదేవి, గ్రామ పెద్దలు రామారావు, ఉపేందర్, వీరస్వామి, వెంకన్న పాల్గొన్నారు.