Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కొంగర సుబ్బయ్య ఆశయ సాధనకు ఉద్యమించండి
- సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు
నవతెలంగాణ- నేలకొండపల్లి
సిపిఎం పట్ల అత్యంత విశ్వాసం, అంకితభావం, నిబద్ధత కలిగిన ఆదర్శ కమ్యూనిస్టును కోల్పోయామని, కొంగర సుబ్బయ్య ఆశయ సాధనకు ఉద్యమించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు అన్నారు. మండలంలోని ఆరెగూడెం గ్రామంలో ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన పార్టీ గ్రామశాఖ కార్యదర్శి కొంగర సుబ్బయ్య సంస్మరణ సభ బుధవారం నిర్వహించారు. తొలుత గ్రామంలో నూతనంగా నిర్మించిన సుబ్బయ్య స్మారక స్థూపాన్ని ఆయన ఆవిష్కరిం చారు. అనంతరం జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ కొంగర సుబ్బయ్య పార్టీ గ్రామశాఖ కార్యదర్శిగా, ఉప సర్పంచ్‌గా గ్రామాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న అనేక సమస్యలను గుర్తించి పోరాటాలు నిర్మించడంలో వాటి పరిష్కారంలో అవిశ్రాంతంగా కృషి చేశారన్నారు. గ్రామాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న అనేక సమస్యలపై నిత్యం అధ్యయనం చేయడంతో పాటు ప్రజలను చైతన్యవంతం చేస్తూ పార్టీని అగ్రభాగాన నిలిపారన్నారు.కరోనా మహమ్మారినీ కట్టడి చేయడంలో కమ్యూనిస్టు దేశాలు, రాష్ట్రాలు ముందుచూపుతో వ్యవహరిస్తూ అందరికీ ఆదర్శంగా నిలిచాయన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఉద్యమించడమే కొంగర సుబ్బయ్యకు ఇచ్చే ఘనమైన నివాళి అన్నారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు రాయల వెంకటేశ్వర్లు, మండల కార్యదర్శి గుడవర్తి నాగేశ్వరరావు, ఏటుకూరి రామారావు, కెవి రామిరెడ్డి, పగిడికత్తుల నాగేశ్వరరావు, దుగ్గి వెంకటేశ్వర్లు, మీగడ లింగరాజు, గోళ్ళ అచ్చయ్య, బోయినపల్లి వీరయ్య, డివైఎఫ్ఐ మండల అధ్యక్షుడు కణతాల వెంకటేశ్వర్లు, కుటుంబ సభ్యులు మేకల ఉపేందర్, మేకల వెంకయ్య, లక్ష్మయ్య గ్రామస్తులు పాల్గొన్నారు.న