Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఎర్రుపాలెం
కరోనా వైరస్ కట్టడిలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వైఫల్యం చెందాయని, ప్రపంచవ్యాప్తంగా కమ్యూనిస్టు దేశాలలోనే కరోనాను అరికట్ట కలిగారని సీపీఎం పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు పొన్నం వెంకటేశ్వరరావు విమర్శించారు. భీమవరం గ్రామంలో అమరజీవి గొల్లపూడి రాజారావు నగర్లో షేక్ జానీ, గొల్లపూడి శ్రీ హరి నారాయణ అధ్యక్షతన జరిగిన 11వ శాఖ మహాసభను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ పన్నుల పేరుతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు డీజిల్ పెట్రోల్ ధరలు విపరీతంగా పెంచి సామాన్య ప్రజల నడ్డి విరుస్తు న్నారని విమర్శించారు. ఆదాయ వనరుల కోసం తప్ప ప్రజాసమస్యలపై చిత్త శుద్ధి లేదన్నారు. అనంతరం నూతన శాఖ కార్యదర్శులుగా నల్లమోతు హను మంతరావు, గొల్లపూడి పెద్ద కోటేశ్వరరావు లను ఎన్నుకున్నారు. ఈ కార్యక్ర మంలో జిల్లా కమిటీ సభ్యులు మాదినేని రమేష్, చింతలచెరువు కోటేశ్వర రావు, మండల కార్యదర్శి దివ్వెల వీరయ్య, ఆర్గనైజర్ సగోర్తి సంజీవ రావు , ఆంగోతు వెంకటేశ్వర్లు , కోటి సుబ్బారెడ్డి, వెంకట్ నారాయణ రెడ్డి, అను మొలు వెంకటేశ్వరరావు , మోహన్ రావు , షేక్ జానీ, సరోజిని పాల్గొన్నారు.