Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కొత్తగూడెం
సింగరేణి సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగస్తుల రిటైర్మెంట్ వయసు 61 సంవత్సరాలు పెంచినందుకు సిఐటియు హర్షం వ్యక్తం చేస్తోందని, అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను కూడా నెరవేర్చాలని సింగరేణి కాలరీస్ ఎంప్లాయిస్ యూనియన్ (సీఐటీయూ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మంద నరసింహారావు డిమాండ్ చేస్తూ బుధవారం ప్రకటన విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మట్లాడారు. జూలై 20న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సింగరేణి ఉద్యోగస్తులకు రిటైర్మెంట్ వయసు 61 సంవత్సరాలు పెంచాలని సంస్థ అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగిందని తెపారు. అధికారులు కూడా ఈ నెల 26న జరిగే బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ సమావేశంలో నిర్ణయం తీసుకుంటామని తెలియజేశారన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నిర్ణయాన్ని, స్వాగతిస్తూనే, సింగరేణి ఎన్నికల హామీలను నెరవేర్చాలని సీఐటీయూ డిమాండ్ చేస్తుందని స్పష్టం చేశారు. ఎన్నికల సందర్భంగా సింగరేణి ఉద్యోగస్తులకు మారుపేర్లు మారుస్తామని, సొంత ఇంటి కల నెరవేరుస్తామని, ఇన్‌కం టాక్స్ రద్దు చేయిస్తామని, కాంట్రాక్ట్ కార్మికులను రెగ్యులరైజ్ చేస్తామని అనేక హామీలు ఇవ్వడం జరిగిందని గుర్తుచేశారు. కోల్ ఇండియాలో జరిగిన ఒప్పందాలను సింగరేణి యాజమాన్యం. అమలు చేయకుండా నిర్లక్ష్యం వహిస్తుందని, ఈనెల 26న జరిగే బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ సమావేశంలో, కోల్ ఇండియా ఒప్పందాలు, అలవెన్సులు పై ఇన్‌కంటాక్స్ కార్మికులకు తిరిగి చెల్లించాలని, కాంట్రాక్ట్ కార్మికులకు హైపవర్ కమిటీ వేతనాలు ఇవ్వాలని, రూ.15 లక్షల ఇన్సూరెన్స్ కూడా వర్తింపజేయాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, కోల్ ఇండియా ఒప్పందాలను నిర్ణయించి అమలు చేయాలని ఈ సందర్భంగా ఆయన డిమాండ్ చేశారు.