Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీఆర్ఎస్ సభ్యత్వంపై సన్నాహక సమావేశంలో నరేష్ రెడ్డి, మెచ్చా నాగేశ్వరరావు
నవతెలంగాణ-అశ్వారావుపేట
ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్ళాలని పార్టీ శ్రేణులకు టీఆర్ఎస్ ఉమ్మడి ఖమ్మం జిల్లా ఇన్చార్జి నూకల నరేష్ రెడ్డి సూచించా రు. సంక్షేమ ఫలాలపై ప్రజలకు అవగాహన కల్పించి గ్రామ స్థాయిలో టీఆర్ఎస్ పటిష్టం చేయాలని ఆదేశించారు. స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బుధవారం పార్టీ ముఖ్య నాయకులు, ప్రజాప్రతినిధులతో పార్టీ సభ్యత్వం పునరుద్ధరణ పై ఆయన ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు నేతృత్వంలో గిరిజన నియోజకు వర్గమైన అశ్వారావుపేటను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు మండలాల పార్టీ బాధ్యులు భాగస్వామ్యులు కావాలని పిలుపునిచ్చారు. టీఆర్ఎస్ బలోపేతం లక్ష్యంతో మండలాల వారీగా పాత,కొత్త తరం కార్యకర్తలను పార్టీ బాధ్యులు, నాయకులు సమన్వయం చేసుకోవాలని సూచించారు. నియోజకవర్గ అభివృద్ధికి అధిక ప్రాధాన్యతనిస్తానని,ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పధకాలను అర్హులందరికీ మంజూరు చేయిస్తానని ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు స్పష్టం చేశారు. ఇందుకు పార్టీ ప్రజాప్రతినిధులు నాయకులు, కార్యకర్తలు సహకరించాలని కోరారు. తనకు ఎటువంటి వర్గం లేదని,పార్టీకి విధేయులందరికీ తాను అండగా నిలుస్తానని ప్రకటించారు. అనంతరం పార్టీ సభ్యత్వ నమోదుపై చర్చించారు. సమావేశంలో నియోజకవర్గ నాయకులు జారే ఆదినారాయణ, అశ్వారావుపేట ఎంపీపీ జల్లిపల్లి శ్రీరామ్మూర్తి, దమ్మపేట జడ్పీటీసీ పైడి వెంకటేశ్వరరావు, పలువురు సర్పంచ్ లు, టీఆర్ఎస్ ముఖ్య నాయకులు పాల్గొన్నారు.